Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Jagapathi Babu Dubbing: 'పెద్ది' చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కోసం జగపతి బాబు...

Peddi Movie Jagapathi Babu Dubbing: ‘పెద్ది’ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కోసం జగపతి బాబు కష్టాలు చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

Peddi Movie Jagapathi Babu Dubbing: ఎక్కడ చూసిన ఇప్పుడు మనకి కనిపిస్తున్న , వినిపిస్తున్న పేరు ‘పెద్ది’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ చిత్రం పై టీజర్ విడుదల సమయం నుండే అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. ఇక ఆ తర్వాత విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వడం తో , సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. రెండవ సాంగ్ ‘రయ్ రయ్ రారా’ పాటకు , అదే విధంగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ వీడియో కి కూడా ఆడియన్స్ నుండి అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని అందరూ బలంగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు పట్టుమని 8 రోజుల సమయం మాత్రమే ఉంది.

ఇప్పటికే ‘పెద్ది’ మేనియా తారా స్థాయికి చేరుకుంది, మేకర్స్ ఆ మేనియా ని రెట్టింపు చేసేవిధంగా , అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించేలా ప్రతీ రోజు ఎదో ఒక కంటెంట్ ని విడుదల చేస్తూనే ఉన్నారు. నిన్నటితో రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేసాడని డైరెక్టర్ బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు కూడా డబ్బింగ్ పూర్తి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ని స్వయంగా జగపతి బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ఆయన డబ్బింగ్ చెప్తున్న విధానం ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక తప్పదు. గతం లో ఆయన ‘అరవింద సమేత’ చిత్రానికి డబ్బింగ్ చెప్తున్నప్పుడు , ఆయన నోటి నుండి రక్తం కారింది.

ఎందుకంటే ఫక్తు రాయలసీమ యాసతో మాట్లాడాలి కాబట్టి. ఇక ‘పెద్ది’ చిత్రం లో ఉత్తరాంధ్ర యాస మాట్లాడాల్సి ఉంటుంది. దీని కోసం కూడా డబ్బింగ్ చాలా కస్టపడి చెప్పాలి , అందుకే జగపతి బాబు తన వైపు నుండి బెస్ట్ డబ్బింగ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు. ఇక ఈ వీడియో ని చూస్తుంటే , ఈ చిత్రం లో జగపతి బాబు నటించలేదు , జీవించాడు అని అనిపిస్తోంది. ఆయన పాత్ర కచ్చితంగా ఆడియన్స్ చేత కంటతడి పెట్టించేలాగానే ఉండబోతుందని అర్థం అవుతోంది. ఆ డైలాగ్స్ ని వింటుంటే అలాగే ఉంది. డైరెక్టర్ బుచ్చి బాబు కూడా, ఈ చిత్రం లో రామ్ చరణ్ పాత్రతో పాటు, జగపతి బాబు పాత్రని కూడా ఆడియన్స్ జీవితాంతం గుర్తించుకుంటారని చెప్పడం, ఆయన మేకోవర్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో , ఆడియన్స్ లో ఈ పాత్ర పై అంచనాలు భారీగానే ఉన్నాయి చూడాలి మరి ఆ అంచనాలను ఈ పాత్ర అందుకోగలదా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular