Jagadeka Veerudu Athiloka Sundari : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలబడడమే కాకుండా, టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా ఎన్నో సంచలన రికార్డ్స్ కి కేంద్ర బిందువుగా మారిన చిత్రం ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి'(Jagadeka Veerudu Athiloka Sundari). రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆరోజుల్లో ఒక సునామీ. కేవలం ఆరు రూపాయిల టికెట్ రేట్ తో 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంచలనాత్మక చిత్రమిది. ఈ సినిమా విడుదలైన రోజుల్లో వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందేమో అని అందరూ భయపడ్డారు కానీ, ఇసుమంత ఎఫెక్ట్ కూడా చూపించలేదు. వరదలకు పోటీగా, వసూళ్ల వరదను సృష్టించింది ఈ చిత్రం. అలాంటి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ కానుంది.
Also Read : శ్రీదేవి 20 అడిగితే.. చిరంజీవి మరో 15 ఎక్కువ అడిగారు
ఈ సినిమా ప్రింట్ ని సంపాదించడానికి నిర్మాతలు చాలా గట్టి ప్రయత్నాలే చేశారట. రాష్ట్రం మొత్తం జల్లెడ వేసినా ప్రింట్ కి సంబంధించిన నెగెటివ్ దొరకలేదు. అలా మూడేళ్ళ పాటు వెతకగా, విజయవాడ లోని ఒక థియేటర్ లో దొరికిందట. ఆ ప్రింట్ బాగా చెడిపోయింది. దానిని తీసుకొని డిజిటల్ లోకి మార్చడానికి ఎంతో ఖర్చు అయ్యిందట. అలా డిజిటల్ మార్చిన ఈ చిత్రాన్ని 4K కి అప్డేట్ చేయడమే కాకుండా 3D లోకి కూడా మార్చారు. రేపు ఈ చిత్రం 2D మరియు 3D లో కూడా విడుదల కానుంది. అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, 3D వెర్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. అలా టికెట్స్ అమ్ముడుపోతున్న స్క్రీన్ షాట్స్ ని అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఈ సినిమా విలువని వివరిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం కచ్చితంగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను మొదటి రోజు రాబట్టే అవకాశం ఉంది. అదే విధంగా ఫుల్ రన్ లో కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. బుక్ మై షో యాప్ లో గడిచిన 24 గంటల్లో ఈ చిత్రానికి 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. రేపు ఈ సినిమా తో పాటు విడుదలయ్యే కొత్త సినిమాలు బుక్ మై షో ఇంకా ట్రెండింగ్ లోకి కూడా రాలేదు. 3D అనుభూతి బాగుంటే కచ్చితంగా ఈ చిత్రం అనుకున్న దానికంటే భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
Also Read : Also Read : చిరంజీవి జగదేక వీరుడు సినిమాను రీమేక్ చేయగలిగే గట్స్ ఉన్న ఏకైక హీరో అతనే..మనసులో మాట చెప్పిన మెగాస్టార్…