Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా కే రాఘవేంద్రరావు(K.Ravendra Rao) దర్శకత్వంలో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka veerudu athiloka sundari) సినిమా ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసింది. అప్పట్లో ఈ సినిమా సాధించిన విజయాన్ని చూసిన మెగాస్టార్ అభిమానులందరూ చాలా ఆనందపడ్డారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఎప్పటికప్పుడు చిరంజీవి మెగాస్టార్ అనే ఒక బిరుదురుకు న్యాయం చేస్తూ వచ్చారు. ఒక సినిమా డల్ అయింది అంటే చాలు మరో సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తూ మిగతా హీరోల నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నమైతే చేస్తున్నాడు…
చిరంజీవి చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాని కనక ఒకవేళ ఇప్పుడు రీమేక్ చేయవలసి వస్తే మాత్రం ఆ సినిమాను ప్రభాస్ అయితే చాలా అద్భుతంగా చేయగలడు అంటూ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ప్రభాస్ లాంటి స్టార్ హీరో కి ఆ సినిమా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అలాగే ఇప్పుడున్న హీరోల్లో భారీ మార్కెట్ ను కలిగి ఉన్న హీరో కూడా ప్రభాసే కావడం వల్ల ఆయన చేస్తే ఈ సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చెప్పడం విశేషం.
మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో ప్రభాస్ లాంటి మరొక స్టార్ హీరోతో తన సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… ప్రస్తుతం చిరంజీవి మాత్రం భారీ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో తన మార్కెట్ ను పదిలంగా ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు.
తను అనుకున్నట్టుగానే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లని లైన్ లో పెట్టి వారితో సినిమాలను చేసి తప్పకుండా గ్రాండ్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు…తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో పెను ప్రభంజానాలను సృష్టిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు తద్వారా ఆయన మార్కెట్ మరింత పెరుగుతుందా లేదా అనేది…