Mega 157: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన విశ్వంభర (Vishwambhara) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలను చేస్తూ వస్తున్న ఈ సినిమాతో ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన 8 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. మరి ఈ సినిమాతో త్రిబుల్ హ్యాట్రిక్ ని సాధించి ఎలాగైనా సరే తనకంటూ ఒక భారీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read: ‘హిట్ 3’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో నష్టాలు తప్పేలా లేవు!
రాజమౌళి ఇప్పటికే 12 విజయాలను సాధించి మొదటి స్థానంలో ఉండగా అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి ఎనిమిది సక్సెస్ లను సాధించి రెండో ప్లేస్ లో నిలిచాడు… మరి వీళ్ళిద్దరూ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుండటమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్నారు.
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా అద్భుతంగా ఉండబోతుందట. ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే దాదాపు 5కోట్ల వరకు ఖర్చుపెట్టి మరి ఆ బ్యాంగ్ ని తెరకెక్కించే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. జూన్ నెల నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ అయితే ఉన్నారు. ఇక వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: ఇష్టమైన దర్శకుడిని చూద్దామని వెళితే హీరోయిన్ చేసేశారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..
ఈ సినిమాతో చిరంజీవి తన స్టామినాను చూపించి వింటేజ్ చిరంజీవి మరోసారి గుర్తుకు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా వస్తే ఆయనకు గొప్ప క్రేజ్ లభించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులు మరోసారి చిరంజీవిని అభిమానిస్తూ ఆయనకి నీరాజనాలు పలుకుతూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…