https://oktelugu.com/

Tiger Shroff : ఈ స్టార్ హీరో చెల్లెలు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తుందా..? ఇక మాములుగా ఉండదు..

బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా మంది యంగ్ హీరోలు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 23, 2024 / 06:59 PM IST

    tiger shraf

    Follow us on

    Tiger Shroff :  ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల హవా పెరిగిపోతుంది. ఇక ఇప్పటికే చాలామంది హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు అమితాబచ్చన్ తన కొడుకు అయిన అభిషేక్ బచ్చన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోని చేయాలనుకున్నాడు. కానీ తను అనుకున్న విధంగా జరగలేదు. అభిషేక్ బచ్చన్ కొన్ని సినిమాలతో మెప్పించినప్పటికీ స్టార్ హీరో రేంజ్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక దాంతో ఆయన అడపాదడపా సినిమాలు చేస్తూ తన కెరీయర్ ను ముందుకు లాగిస్తున్నాడు. అంతే తప్ప స్టార్ హీరో స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోల కొడుకులందరూ కూడా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఇక షారుక్ ఖాన్ కొడుకు కూడా తొందర్లోనే ఇండస్ట్రీలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించకపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు టాలీవుడ్ లో కూడా విలన్ గా నటించి మెప్పించిన ‘జాకీ ష్రాఫ్’ కొడుకు అయిన ‘టైగర్ ష్రాఫ్’ బాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అలాగే హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాంటి టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం కొన్ని భారీ ప్రాజెక్టులను కూడా టేకాఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే తన ఎంటైర్ కెరియర్ లో ఆయన ఇప్పటివరకు లవ్ స్టోరీస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు.

    మొత్తం యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక అందులో భాగంగానే హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ ‘ సినిమా అతనికి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు తో ఆయన వరుసగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలను చేస్తున్నాడు. ఇక ఆయన ఏ సినిమా చేసిన కూడా చాలావరకు కష్టపడి ఎలాగైనా సరే ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే టైగర్ ష్రాఫ్ కెరియర్ అనేది కొంతవరకు పర్లేదనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు జాకీ ష్రాఫ్ కూతురు అయిన కృష్ణ ష్రాఫ్ కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈమె ఇప్పటికే బిజినెస్ రంగంలో తనదైన ముద్ర వేసుకొని సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పేరు సంపాదించుకుంది. ఈమె ఎక్కువగా జిమ్, ఫిట్నెస్ లకు సంబంధించిన బిజినెస్ లను చేస్తుంది. ఇక దాంతో పాటుగా ఆమె పలు టీవీ షో ల్లో కూడా పాల్గొంటూ తనను తాను జనాలకి పరిచయం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె మోడలింగ్ రంగంలో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.

    ఇక మొత్తానికైతే అటు బిజినెస్ లో గుర్తింపు సంపాదించుకుంటూనే, ఇటు కెరియర్ ను కూడా చాలా ప్లాన్డ్ గా సెటిల్ చేసుకునే ప్రయత్నంలో కృష్ణ ష్రాఫ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆమె సినిమా ఇండస్ట్రీలో కూడా నటిగా రాణించాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆమె ఆశించినట్టుగానే ఆమెకి ఇక్కడ మంచి అవకాశాలు వస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే జాకీ ష్రాఫ్ వారసులు తనదైన రీతిలో ఇండస్ట్రీ లో ముందుకు దూసుకెళ్లాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు…