Jack Trailer : ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాల తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) హీరో గా నటిస్తున్న చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్'(Jack – Konchem Krack). భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడిన తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నుండి విడుదల కాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉంది. ఈ నెల 11వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే చేస్తూ వచ్చిన భాస్కర్ మొట్టమొదటిసారి కాస్త తన కంఫర్ట్ జోన్ ని దాటి ఈ చిత్రాన్ని తీసినట్టుగా ట్రైలర్ ని చూస్తే అనిపించింది.
ఇందులో హీరో క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. సిద్ధూ జొన్నలగడ్డ మార్క్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఈ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రకాష్ రాజ్ టెర్రరిస్టుల గ్యాంగ్ ని పట్టుకునేందుకు ఒక ఆపరేషన్ మొదలు పెడుతాడు, ఆ ఆపరేషన్ లో హీరో కూడా ఉంటాడు. హీరో కి ఈ ఆపరేషన్ కి అసలు ఏమిటి సంబంధం?, హీరో ఎందుకు నిత్యం దొంగతనాలు చేస్తూ ఉన్నాడు?, హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎందుకు హీరో వద్ద సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది?, ఇలా ఎన్నో సందేహాలను వదిలింది ఈ ట్రైలర్. అయితే సిద్ధూ మార్క్ డైలాగ్స్ కథకు అవసరం లేకపోయినా అంటించినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటివి కామెడీ మూవీస్ లో బాగా వర్కౌట్ అవుతాయి కానీ, సీరియస్ సబ్జెక్టు లో వర్కౌట్ అవ్వదు. కనీసం సినిమాలో అయినా ఇలాంటివి డైరెక్టర్ జాగ్రత్తగా చూసుకొని ఉంటాడేమో చూడాలి.
ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత అనిపించిన మరో ఫీలింగ్ ఏమిటంటే ‘డీజే టిల్లు’ ఇమేజ్ నుండి సిద్ధూ ఇంకా బయటకు రాలేదు అనిపిస్తుంది. టిల్లు నే జాక్ సినిమాలో వచ్చి నటించినట్టుగా ఉంది కానీ, జాక్ క్యారక్టర్ కనిపించలేదు. ఇది కూడా ఈ చిత్రానికి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టిల్లు క్యారక్టర్ మీద బోర్ కొత్తనాన్ని రోజులు, ఆ క్యారక్టర్ తరహా డైలాగ్ డెలివరీ వర్కౌట్ అవ్వొచ్చు. సిద్ధూ గత చిత్రం టిల్లు స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రం మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మరి జాక్ చిత్రం ఏ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లను రాబడుతుంది?, ఎంత లాంగ్ రన్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.
Also Read : రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సిద్దు జొన్నలగడ్డ.. శర్వానంద్ తో సమానంగా తీసుకుంటున్నాడుగా!