https://oktelugu.com/

Smartphone: స్మార్ట్ ఫోన్ లో ఉండే ఈ చిన్న హోల్ ప్రత్యేకత గురించి మీకు తెలుసా…

Smartphone: చాలా మంది ఫోన్ అయితే వాడుతున్నారు కానీ అందులో ఉండే కొన్ని ఫీచర్స్ గురించి చాలా మందికి తెలియదు అని చెప్పచ్చు.ప్రతి స్మార్ట్ ఫోన్ లో కింద ఒక చిన్న హోల్ ఉంటుంది.అయితే అది దేని కోసమో మనలో చాలా మందికి తెలియదు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 10, 2024 / 04:37 PM IST

    Do you know the use of this small hole in smart phones

    Follow us on

    Smartphone: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కడ చూసిన బాగా పెరిగిపోయింది.ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది.అయితే చాలా మంది ఫోన్ అయితే వాడుతున్నారు కానీ అందులో ఉండే కొన్ని ఫీచర్స్ గురించి చాలా మందికి తెలియదు అని చెప్పచ్చు.ప్రతి స్మార్ట్ ఫోన్ లో కింద ఒక చిన్న హోల్ ఉంటుంది.అయితే అది దేని కోసమో మనలో చాలా మందికి తెలియదు.

    ఈ హోల్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..స్మార్ట్ ఫోన్ లో ఉండే ఈ చిన్న హోల్ మైక్రోఫోన్ అనుకుంటారు చాలా మంది.అయితే ఇది మైక్రోఫోన్ గ్రిల్.ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ గా ఉపయోగపడుతుంది.మనం ఫోన్ కాల్స్ మాట్లాడే సమయంలో చుట్టూ పక్కల నుంచి వచ్చే శబ్దాలను తగ్గించటంలో ఇది సహాయపడుతుంది.అయితే ఈ మైక్రోఫోన్ గ్రిల్ మెయిన్ మైక్రోఫోన్ తో కలిసి పని చేస్తుంది.

    మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చుట్టూ పక్కల నుంచి వచ్చే శబ్దాలను ఈ స్మాల్ మైక్రోఫోన్ నియంత్రించి కేవలం మీరు మాట్లాడే మాటలు మాత్రమే మెయిన్ మైక్రోఫోన్ నుంచి వినిపించేలా చేస్తుంది.మీరు మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికీ బాగా స్పష్టంగా వినబడతాయి.మాట్లాడేటప్పుడు పక్కన ఏవైనా శబ్దాలు ఉన్నప్పటికీ దాని తీవ్రత మాత్రం తగ్గేలా చేస్తుంది ఈ చిన్న హోల్.

    ఈ నాయిస్ క్యాన్సిలేషన్ హోల్ లేనట్లయితే మీరు మాట్లాడటంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.అవతలి వ్యక్తికీ మీరు మాట్లాడే మాటలు సరిగ్గా వినిపించవు.పాత రకాలైన కొన్ని ఫోన్ లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.అయితే ప్రస్తుతం ఉన్న దాదాపు అన్ని ఫోన్ లలో ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ లలో కూడా ఇదే ఫీచర్ ను కంపెనీలు అందుబాటులోకి తెస్తున్నాయి.