Telangana Congress: కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉంది. తెలంగాణ ఎన్నికల్లో సైతం వ్యూహాలు పన్నుతోంది. ఎన్నికల ముంగిట కొన్ని సమీకరణలో ఆ పార్టీకి ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చేందుకుకాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతోంది. ఈ క్రమంలో ఓ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నారు. ఇది హై కమాండ్ కు కలవరపాటుకు గురిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న నియోజకవర్గాల్లో సగానికి పైగా కేటాయించాల్సి ఉంటుంది.
ఇటీవల రేవంత్ రెడ్డి బీసీ నాయకులకు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని ప్రకటించారు. ప్రతి పార్లమెంటరీ స్థానం పరిధిలో రెండు నియోజకవర్గాలను బీసీలకు కేటాయించనున్నట్లు తెలిపారు. అప్పటినుంచి బీసీల్లో కాక రేగుతోంది. తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున సీట్లు అధికంగా కేటాయించాలని వారు కోరుతున్నారు. ప్రతి లోక్ సభ స్థానం పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.కర్ణాటకలో ఇదే ఫార్ములాతో గెలుపొందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభమైంది.
తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఏకతా టి పైకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలుపుతోంది. రెడ్డి సామాజిక వర్గం నేతలు పెద్ద ఎత్తున టికెట్లు ఆశిస్తున్నారు.పోటీకి అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో బీసీ నినాదం తెరపైకి రావడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన గురిచేస్తుంది. ప్రధానంగా గెలిచే స్థానాల్లోనే బీసీ నేతలు టిక్కెట్లు కోరుతుండడం విశేషం.
అధికార బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలు చాలా తక్కువ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 మంది బీసీ నేతలకు టికెట్లు ఇచ్చింది.ఈసారి కనీసం 50 పైగా టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ బీసీ ఇతర నేతలు ఆశవాహులుగా ఎక్కువమంది ఉన్నారు. దీంతో ఎలా ముందుకెళ్లలో తెలియక కాంగ్రెస్ హై కమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికల ముంగిట టిక్కెట్ల కేటాయింపు ఆ పార్టీకి కత్తి మీద సామే. ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.