https://oktelugu.com/

Jabardasth Rocking Rakesh: జ‌బ‌ర్ద‌స్త్‌లో నిజ‌మైన ప్రేమికులు.. ఆ లేడీ క‌మెడియ‌న్‌తో ల‌వ్‌లో ప‌డ్డ‌ రాకేశ్

Jabardasth Rocking Rakesh: ఈ టీవీలో షోల‌లో ఒక కామ‌న్ ఫార్ములా ఉంటుంది. అదేంటంటే.. ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ పెట్ట‌డం, దాని చుట్టూ స్కిట్లు చేయించి రేటింగ్స్ పెంచుకోవ‌డం, సుడిగాలి సుధీర్‌, ర‌ష్మి నుంచి మొద‌లు పెడితే.. మొన్న వ‌చ్చిన ఇమ్మాన్యూయేల్‌, వ‌ర్ష వ‌ర‌కు ఇలాంటి రీల్ జోడీలు ఎన్నో క‌నిపించాయి. అయితే ఇవ‌న్నీ కేవ‌లం స్క్రిప్ట్ కోస‌మే చేస్తున్నారనేది అంద‌రికీ తెలిసిందే. కాగా ఇప్పుడు మాత్రం ఓ రియ‌ల్ జంట […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 22, 2022 / 12:27 PM IST
    Follow us on

    Jabardasth Rocking Rakesh: ఈ టీవీలో షోల‌లో ఒక కామ‌న్ ఫార్ములా ఉంటుంది. అదేంటంటే.. ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ పెట్ట‌డం, దాని చుట్టూ స్కిట్లు చేయించి రేటింగ్స్ పెంచుకోవ‌డం, సుడిగాలి సుధీర్‌, ర‌ష్మి నుంచి మొద‌లు పెడితే.. మొన్న వ‌చ్చిన ఇమ్మాన్యూయేల్‌, వ‌ర్ష వ‌ర‌కు ఇలాంటి రీల్ జోడీలు ఎన్నో క‌నిపించాయి. అయితే ఇవ‌న్నీ కేవ‌లం స్క్రిప్ట్ కోస‌మే చేస్తున్నారనేది అంద‌రికీ తెలిసిందే. కాగా ఇప్పుడు మాత్రం ఓ రియ‌ల్ జంట గురించి మీకు చెప్ప‌బోతున్నాం.

    raking rakesh sujatha

    ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన‌వి అన్నీ రీల్ జోడీలు అయితే.. ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం నిజంగానే ప్రేమ జంట గురించి. రాకింగ్ రాకేష్ ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ లో టీమ్ లీడ‌ర్ గా ఉన్నాడు. అత‌ను పిల్ల‌ల‌తో చేసే స్కిట్లు చాలా బాగా ఉంటాయి. అందుకే వారితోనే త‌న స్కిట్ల‌ను కంటిన్యూ చేస్తున్నాడు. కాగా ఇత‌ను ఇప్పుడు ఓ లేడీ క‌మెడియ‌న్ తో నిజంగానే ప్రేమ‌లో ప‌డిపోయాడు.

    Also Read:  మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?

    త‌న టీమ్‌లో చేసిన జోర్దార్ సుజాతతో అత‌ను ల‌వ్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తో సుజాత మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఆమె ఓ ఛానెల్ లో యాంకర్‌గా చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ఈటీవీ షోల‌లో చేస్తూనే ప‌లు ఈవెంట్లు కూడా చేస్తోంది. అయితే రాకింగ్ రాకేశ్ స్కిట్ల‌లో చేస్తూ ఫుల్ బిజీగా ఉంది సుజాత‌. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య చ‌నువు పెరిగింది.

    అది ప్రేమ‌గా మారింది. ఈ విష‌యాన్ని మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక‌గా వారిద్ద‌రూ బ‌య‌ట పెట్టారు. మొన్న ప్రేమికుల దినోత్స‌వం నాడు స్పెష‌ల్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా.. ఇందులో రాకేశ్ త‌న ప్రేయ‌సి సుజాత వేలికి రింగ్ తొడిగి మ‌రీ ప్రపోజ్ చేశాడు. అయితే దీన్ని కూడా చాలామంది స్క్రిప్ట్ అనుకున్నారు. కానీ ఇదే విష‌యంపై జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ బాబు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. రాకేష్, సుజాత జంట చాలా బాగుంటుంద‌ని, ఒక‌ర‌కంటే ఒక‌రికి ప్రాణం అని కూడా చెప్పాడు. వారిద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణిస్తే చాలా బాగుంటుంద‌న్నాడు. ఇక త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి పెండ్లి ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ సంవ‌త్స‌రంలోనే వీరిద్ద‌రూ పెండ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు జ‌బ‌ర్ద‌స్త్ న‌టులు చెబుతున్నారు. మ‌రి వారిద్ద‌రూ ఎప్పుడు పెండ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారో చూడాలి.

    Also Read: పార్వ‌తి పాట‌కు  కదిలిన హృదయాలు,  ప‌రుగులు పెట్టిన  బ‌స్సు

    Tags