Chammak Chandra- Satya: జబర్దస్త్ కామెడీ షో ఎంతటి ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. కానీ మొదట ఉన్న క్రేజీ ఇప్పుడు లేదు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లుగా జబర్దస్త్ కు రెస్పాన్స్ అంతగా రావడం లేదు. మొదట్లో 18 వచ్చిన రేటింగ్ ప్రస్తుతం పది కూడా రావడం లేదు. దీంతో కమెడియన్లలో కూడా నైరాశ్యం పట్టుకుంది. సీనియర్లు చాలా మంది షో నుంచి వెళ్లిపోయారు. ఒకప్పుడు సీనియర్లందరు ఉన్నప్పుడు కామెడీ పండింది. పంచుల వర్షం కురిసేది.

కానీ ఇప్పుడు ఏదో మొక్కుబడిరా నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జబర్దస్త్ నుంచి సీనియర్లు వెళ్లిపోవడానికి కారణం పారితోషికమే. రెమ్యునరేషన్ పెంచాలని కమెడియన్లు కోరితే కుదరదనే సమాధానం వచ్చేది. దీంతో నాగబాబు సైతం వారి పక్షాన నిలబడి అడిగితే ఆయనను కూడా పొమ్మన్నారు. దీంతోనే నాగబాబు ఇతర చానళ్లలో ప్రత్యక్షం అవుతున్నారు. నాగబాబు వెళ్లిపోవడంతో చాలా మంది కమెడియన్లు కూడా సర్దుకున్నారు.
Also Read: Mahesh- Trivikram: మహేష్ కోసం ముగ్గురు హీరోయిన్లు.. త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ ఇది
జబర్దస్త్ లో మంచి కమెడియన్ ఎవరంటే చమ్మక్ చంద్రే. అతడి స్కిట్ల కోసం జనం ఎగబడేవారు. దీంతో జబర్దస్త్ ను చంద్ర ఎక్కడికో తీసుకుపోయాడు. అత్యధిక పారితోషికం తీసుకునే ఆర్టిస్టు కూడా చంద్రనే కావడం గమనార్హం. కానీ కొద్ది రోజులుగా జబర్దస్త్ లో చంద్ర కూడా కనిపించడం లేదు. అతడితో పాటు కామెడి పండించిన మహిళా ఆర్టిస్టు సత్య కూడా చంద్రకు మంచి సహాయం అందించేది. దీంతో వారిద్దరు స్కిట్ చేశారంటే అంతే. దానికి మంచి స్పందన రావాల్సిందే. అంతటి ప్రాధాన్యం దక్కించుకున్న ఆర్టిస్టులు వారిద్దరు.

వారిద్దరి మీద కూడా ఏవో పుకార్లు వచ్చాయి. చమ్మక్ చంద్రకు సత్యకు ఏదో సంబంధం ఉందనే టాక్ వచ్చింది. దీంతో సత్య ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చమ్మక్ చంద్ర తనకు గురువు లాంటి వారని చెప్పింది. అంతేకాని మా మధ్యలో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. దీనికి చంద్ర భార్య కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. తన భర్త మీద తనకు నమ్మకం ఉందని అదంతా వట్టి పుకారని కొట్టిపారేసింది. ఇద్దరు కలిసుంటే చాలు ఏవేవో గాసిప్స్ సృష్టించడం అలవాటే.
ఇక జబర్దస్త్ లో సీనియర్లు మొత్తం బయటకు వెళ్లారు. ఇప్పుడున్నదంతా తుక్కే. దీంతో కామెడీ కోసం వారు ఆరాటపడుతున్నా పంచుల వర్షం మాత్రం పడటం లేదు. దీంతో ప్రేక్షకుల్లో నైరాశ్యం పట్టుకుంది. ఏదో చూద్దాంలే అనే ధోరణి వస్తోంది. గతంలో తప్పనిసరిగా గురువారం, శుక్రవారం టీవీలకు అతుక్కుపోవాల్సిందే. పంచుల వర్షానికి తడవాల్సిందే. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆ దూకుడు కనిపించడం లేదు. ఏదో నామ్ కే వాస్తేగా కానిస్తున్నారు. జబర్దస్త్ రేటింగ్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఒకప్పటి రేటింగ్ కు ఇప్పటి రేటింగ్ కు సంబంధమే లేదు.
Also Read:NTR- Nitin Narne: అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ బావమరిది స్టార్ట్ చేస్తాడట
[…] […]
[…] […]