Mahesh- Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమాలోని హీరో రోల్ ‘పార్థు’ను ఇప్పుడు చేస్తున్న సినిమాకి టైటిల్‌గా ఖరారు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలాగే ‘అర్జునుడు’ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. అయితే, తన సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండటం అనేది త్రివిక్రమ్ కి ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

హీరోయిన్ల పాత్రలు కథలో భాగమా లేదా అనేది కూడా త్రివిక్రమ్ కి అనవసరం. ఒకవేళ కథలో మెయిన్ హీరోయిన్ కి తప్ప మిగతా హీరోయిన్లకు స్కోప్ లేకపోతే.. ఏ చిన్న పాత్రకో, కనీసం ఒక పాట కోసమో మరో హీరోయిన్ ను పెట్టకపోతే త్రివిక్రమ్ కి నిద్ర పట్టదు. ఒక విధంగా త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ ఇది. కాబట్టి ఈ సినిమాలో మూడో హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
Also Read: NTR- Nitin Narne: అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ బావమరిది స్టార్ట్ చేస్తాడట
అయితే తాజాగా ఈ భామను ఫైనల్ చేశారు. ఈ భామ “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే చిత్రంలో నటించింది. కానీ తొలి చిత్రం ఆడలేదు. అలాగే, ఆమె నటన కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేదు. అయినా అమ్మడుకు త్రివిక్రమ్ ఛాన్స్ ఇవ్వడం విశేషమే. అన్నట్టు ఆమె రవితేజ సరసన “ఖిలాడీ” సినిమాలో కూడా నటించింది. ఇక త్రివిక్రమ్ – మహేష్ సినిమా షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.
ఆగస్టు 8వ తేదీ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేక సెట్ లో మహేష్ పై ఓ సోలో సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారు. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకున్నామని ఇప్పటికే ప్రకటన వచ్చింది. పూజా హెగ్డేని వరుసగా మూడోసారి తన సినిమాలో పెట్టుకుంటున్నాడు త్రివిక్రమ్. ఇక రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తీయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్.

అందుకే, సినిమా కథలో కూడా యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యేలా స్క్రిప్ట్ రాశాడట. అలాగే త్రివిక్రమ్ ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నాడు. కాగా యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఆ సామాజిక అంశం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందట.
మరోపక్క త్రివిక్రమ్ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తో త్రివిక్రమ్ కి పదిరోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా కూర్చున్నాడు.
Also Read: Sivatmika: శివాత్మిక లిస్ట్ పెరిగింది.. రాజశేఖర్ కి ఇక పుత్రికోత్సాహమే ఆలస్యం !
[…] Also Read: Mahesh- Trivikram: మహేష్ కోసం ముగ్గురు హీరోయిన్ల… […]
[…] Also Read:Mahesh- Trivikram: మహేష్ కోసం ముగ్గురు హీరోయిన్ల… […]