Ritu Chaudhary: జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి తెలియనివారుండరు. ఈ యంగ్ బ్యూటీ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. రీతూ చౌదరి మొదట్లో సీరియల్స్ లో నటించింది. అయితే ఆమెకు అనుకున్నంత ఫేమ్ రాలేదు. దాంతో జబర్దస్త్ లో లక్ పరీక్షించుకుంది. రీతూ చాలా కాలం జబర్దస్త్ లో కొనసాగింది. రీతూ కామెడీతో పాటు ఆమె గ్లామర్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఆ విధంగా రీతూ బుల్లితెర సెలబ్రెటీగా అవతరించింది.
గతంలో రీతూ చౌదరి పెళ్లి హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అతన్నే రీతూ చౌదరి వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. అతడు ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, ఇద్దరూ ప్రేమించుకోవడంతో పెద్దలు పెళ్లి చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలు పుకార్లుగా మిగిలిపోయాయి. రీతూ చౌదరి వివాహం జరగలేదు.
ఆ వ్యక్తితో మరలా కనిపించలేదు. ఇటీవల ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది. రీతూ చౌదరి తండ్రి అకాల మరణం చెందాడు. ఆయన అనారోగ్యంతో కన్నుమూశాడు. తండ్రి మరణంతో రీతూ చౌదరి కృంగిపోయింది. ఆయన దూరమైన వేదన తెలియజేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. రీతూ ఎమోషనల్ వర్డ్స్ అందరి చేత కన్నీరు పెట్టించాయి.
కొన్నాళ్లుగా రీతూ జబర్దస్త్ లో కూడా కనిపించడం లేదు. ఆమె బుల్లితెరకు దూరమయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. తాజా షార్ట్స్ టాప్ ధరించి సూపర్ గ్లామరస్ ఫోజుల్లో మైండ్ బ్లాక్ చేసింది. రీతూ గ్లామర్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రీతూ చౌదరి తీరు చూస్తుంటే బట్టలు కూడా బరువైపోతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.