Tomato Prices Increase: దేశంలో ధరలు దడపుట్టిస్తున్నాయి. నిత్యావసరాల సరుకుల ధరలతో పాటు కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యతరగతి వాడిపై పెనుభారం మోపుతున్నాయి. దీంతో ఏం కొనాలో ఏం తినాలో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ధరలు ఇలా పెరుగుతుంటే సామాన్యుడి జీవితం ఎలా సాగుతుంది. రోజు కూలీ చేసుకుని జీవించే సగటు మనిషి జీవితం ఎలా ముందుకు వెళ్తుంది. టమాట ధరలు భారంగా మారుతున్నాయి.
కిలో రూ. 160
టమాట ధర ప్రస్తుతం రూ. 160గా పలుకుతోంది. దీంతో టమాట తినడం ఎలా? ఇంత ధర పెట్టుకుని తినాల్సిన అవసరం ఉందా? తినకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు. మామూలుగా అయితే రూ. 30 నుంచి 40 వరకు ఉండే టమాట ధర ఇంత భారీగా పెరగడం వల్ల తినాలనే ఆశలనే చంపుకుంటున్నారు. ధర దిగొస్తుందని అంటున్నా అది మాత్రం దిగి రావడం లేదు. మధ్యప్రదేశ్ లో టమాట ధర రూ.160 పలకడంతో వారి బాధలు వర్ణనాతీతం.
ఎప్పుడు దిగొస్తుందో?
టమాట ధర ఎప్పుడు దిగొస్తుందో అని చూస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం టమాట ధర రూ.120కి పైగానే ఉంది. దీంతో పావుకిలో టమాట రూ.30 పలుకుతోంది. ఇలా అయితే కొనడం కష్టమే. తినడం ఇంకా కష్టంగానే భావిస్తున్నారు. టమాట ధరపై ప్రభుత్వం కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
మిగతా కూరగాయల ధరలు
టమాట ధరలు పెరగడంతో ఇతర కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఏది కొనాలన్నా చేయి రావడం లేదు. కాకరకాయ, బెండకాయ, బీరకాయ లాంటి వాటి ధరలు కూడా పెరిగాయి. దీంతో తినాలనే ఆశను కూడా దూరం చేసుకుంటున్నారు. కిలో టమాటలకు అరకిలో చికెన్ వస్తుంది. ఇంతలా ధరలు పెరడం వల్ల ఏం చేయాలో తోచడం లేదు. ధరలు ఎప్పుడు దిగొస్తాయోనని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు.