Jabardasth Rohini: బుల్లితెర సెలబ్రిటీలలో రోహిణి ఒకరు. సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె జబర్దస్త్ షోతో మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు వెబ్ సిరీస్లు, చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే రోహిణికి ఒక సమస్య ఉంది. ఆమెకు 2016లో ప్రమాదం జరిగింది. కాలు విరగడంతో వైద్యులు రాడ్ అమర్చారు. గాయం మానిపోయినప్పటికీ కాలిలో రాడ్ అలానే ఉండిపోయిందట. దాని వలన డాన్స్ చేసేటప్పుడు, కొంచెం ఒత్తిడితో కూడిన పనులు చేసేటప్పుడు నొప్పి పుడుతుందట. అందుకని కాలు నుండి రాడ్ తీయించేసేయాలని హాస్పిటల్ కి వెళ్లారట.
అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెను ఆపరేషన్ గదికి తీసుకుపోయారట. అనంతరం కాలు నుండి రాడ్ తొలగించడం వీలు కాదని చెప్పారట. చాలా ఏళ్ళు గడిచిన నేపథ్యంలో రాడ్ ఎముకలోకి చొచ్చుకుపోయింది. బలవంతంగా బయటకు లాగితే ఎముకకు డామేజ్ జరిగే ప్రమాదం ఉందన్నారట. నొప్పి కలిగినా చేసేదేమీ లేదు. కాలిలో రాడ్ ని భరించాల్సిందే అని చెప్పారట. నొప్పి రాకుండా ఉండేదుకు మెడిసిన్ ఇచ్చారట.
రోహిణికి వైద్యుల మాటలు నిరాశపరిచాయట. జీవితాంతం ఈ బాధ భరించాల్సిందేనా అని ఆమె వాపోతున్నారట. దీనికి సంబంధించి రోహిణి ఓ వీడియో విడుదల చేశారు. ఈవెంట్స్, షోలలో రాడ్ తో డాన్స్ చేయడం ఇబ్బందిగా ఉందని రోహిణి వెల్లడించారు. రోహిణి పరిస్థితి తెలిసిన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
రోహిణి ఇటీవల బలగం మూవీలో కీలక రోల్ చేశారు. ఆమె కామెడీ ఓ రేంజ్ లో పేలింది. ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పూయించింది. బలగం డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం నటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఇటీవల విడుదలైన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్లో కూడా ఓ రోల్ చేసింది. సేవ్ ది టైగర్స్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. రోహిణి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. మెల్లగా వెండితెర మీద రోహిణి బిజీ అవుతున్నారు.