https://oktelugu.com/

Jabardasth Faima: చనిపోతానని బెదిరించాను, నా దగ్గర రూ. 500 కూడా ఉండేవి కావు… జబర్దస్త్ ఫైమా అసలు జీవితం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

జబర్దస్త్ ఫైమా ఒకప్పటి జీవితం తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. కటిక పేదరికంలో పుట్టిన ఫైమా స్వశక్తితో ఎదిగింది. ఫైమా కుటుంబానికి సొంత ఇల్లు ఉండేది కాదట. చేతిలో రూ. 500 లేక అప్పు చేసిన రోజులు ఉన్నాయట. గతంలో తాను అనుభవించిన కష్టాలు ఫైమా గుర్తు చేసుకుంది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 1, 2024 / 12:45 PM IST

    Jabardasth Faima

    Follow us on

    Jabardasth Faima: ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చింది. తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చింది. బుల్లెట్ భాస్కర్ టీం లో స్కిట్స్ చేస్తూ పాపులారిటీ రాబట్టింది. కామెడీలో ఫైమా తనదైన శైలి క్రియేట్ చేసుకుంది. లేడీ స్టార్ కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించింది. దాంతో బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైమా కి అవకాశం వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఫైమా అదరగొట్టింది.

    Also Read: నాకు నా భర్త రాజ్ తరుణ్ కావాలన్న లావణ్య.. రాజ్ తరుణ్ రియాక్షన్ వైరల్…

    టాస్కులు, ఎంటర్టైన్మెంట్ పరంగా సత్తా చాటింది. దాదాపు ఫైనల్ వరకు వెళ్ళింది. ఫ్యామిలీ వీక్ తర్వాత ఫైమా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో సొంత ఇల్లు కట్టించి, తన పేరెంట్స్ కి గిఫ్ట్ గా ఇచ్చింది. బిగ్ బాస్ తర్వాత ఫైమాకు పలు టీవీ షోల్లో ఆఫర్లు వచ్చాయి. స్టార్ మా ఛానల్ లో నీతోనే డాన్స్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం వంటి షోలు చేసింది. ఆ తర్వాత తిరిగి జబర్దస్త్ కి వెళ్ళింది.

    ఎప్పటిలాగే బుల్లెట్ భాస్కర్ టీం లో స్కిట్స్ చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఫైమా బాగానే సంపాదిస్తుంది. ఆర్ధికంగా కూడా కాస్త నిలదొక్కుకుంది. కానీ ఒకప్పుడు కనీసం చేతిలో 500 కూడా ఉండేవి కావట. ఉండటానికి ఇల్లు కూడా లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఫైమా లేటెస్ట్ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. ఫైమా మాట్లాడుతూ .. నేను పటాస్ షోకి వెళ్లే వరకు మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఆ షో నిర్వాహకులు కొంతమంది స్టూడెంట్స్ ని ఆడియన్స్ కింద తీసుకునేవారు.

    కొంతమంది స్టూడెంట్స్ ని పంపించమని మా కాలేజ్ వాళ్ళతో అడిగారట. అప్పుడు మా కాలేజీ వాళ్ళు స్టూడెంట్ కి 500 రూపాయల చొప్పున వసూలు చేసి పిక్నిక్ లాగా ఆ షో కి తీసుకుని వెళ్లారు. ఆ టైంలో నా దగ్గర 500 రూపాయలు కూడా లేవు. మా ఫ్రెండ్ ని వద్ద అప్పుగా తీసుకుని వెళ్ళాను. నా అల్లరి, చలాకీతనం చూసి పటాస్ షో లోకి తీసుకున్నారు. ఈ విషయం ఇంట్లో చెబితే అమ్మ ఒప్పుకోలేదు. అన్నం తినకుండా రెండు రోజులు ఏడ్చాను. మా నాన్న వేరే కంట్రీలో ఉంటారు. ఆయన్ని అడిగితే వద్దు అన్నారు.

    దీంతో ఒకరు రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుని చనిపోతాను అని బెదిరించాను. మా అమ్మ భయపడి ఒప్పుకుంది. అలా నా జర్నీ మొదలైంది. ఇప్పుడు ఈ స్థాయి వరకు వచ్చాను. ఇప్పటికి కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేదు అంటూ ఫైమా జోక్ చేసింది. కాగా కమెడియన్ ప్రవీణ్ ని ఫైమా ప్రేమించింది. కొన్నాళ్ళు వీరి రిలేషన్ బాగానే సాగింది. కారణం తెలియదు కానీ విడిపోయారు. ప్రవీణ్ తో స్నేహం ఉంది. మేము ప్రేమికులం కాదని ఫైమా అంటుంది.

     

    Also Read: రవితేజ వదులుకున్న ఈ సినిమా ఆ యంగ్ హీరో కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారిందా..?