Homeఎంటర్టైన్మెంట్Jabardasth Faima: ఐదేళ్లుగా ప్రేమాయణం.. రహస్య ప్రేమికుడిని పరిచయం చేసిన ఫైమా, అందరూ షాక్!

Jabardasth Faima: ఐదేళ్లుగా ప్రేమాయణం.. రహస్య ప్రేమికుడిని పరిచయం చేసిన ఫైమా, అందరూ షాక్!

Jabardasth Faima: జబర్దస్త్ ఫైమా పరిచయం అక్కర్లేని పేరు. పటాస్ షోలో కామెడీ పంచుతూ కొంత ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ షో ఆమెకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తుంది. కాగా ఫైమా బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది. ఈ కారణంగా ఆమె జబర్దస్త్ కి దూరమైంది. బిగ్ బాస్ హౌస్లో అంచనాలకు మించి రాణించింది ఫైమా. పది వారాలకు పైగా హౌస్లో ఉంది. ఆమెతో పాటు హౌస్లో అడుగుపెట్టిన చలాకీ చంటి ఐదు వారాలు కూడా ఉండలేకపోయాడు.

కాగా హౌస్లో ఉన్నపుడు ఫైమా మరో కమెడియన్ ప్రవీణ్ ని ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. పరోక్షంగా అతడంటే ఇష్టం అని చెప్పింది. నాకు అన్ని విషయాల్లో అతడు తోడుగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చిన ఫైమాకు ప్రవీణ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. ఆమె ఇంటికి వెళ్లి సందడి చేశాడు. మెడలో ఉన్న చైన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు.

అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఫైమా నన్ను అవైడ్ చేస్తుంది. నాకు బ్రేకప్ చెప్పిందని వెల్లడించాడు. ఈ వివాదంపై ఫైమా కూడా స్పందించింది. ప్రవీణ్ నేను కేవలం సిల్వర్ స్క్రీన్ స్కిట్స్ కోసం ప్రేమికులుగా ఉన్నాము. మా జంటను ఆడియన్స్ ఆదరించారు. అది మేము కొనసాగించాము. అంతే కానీ మా మధ్య ఏమీ లేదని చెప్పింది. అలాగే ప్రవీణ్ తో తనకు మనస్పర్థలు ఉన్నాయని కూడా చెప్పింది.

సడన్ ఆ ప్రవీణ్ నాయక్ అనే మరో వ్యక్తిని పరిచయం చేసి షాక్ ఇచ్చింది. ఫైమా బర్త్ డే నేపథ్యంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు షేర్ చేసింది. మాది ఐదేళ్ల ప్రేమాయణం. ఎప్పటికీ ఫైమాను వదలను అని ప్రవీణ్ నాయక్ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారా? మరి ప్రవీణ్ తో బంధం ఎలా కొనసాగించావని నెటిజెన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎవరీ ప్రవీణ్ నాయక్ అని ఆరా తీస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Praveen Nayak (@praveen_nayak.24)

RELATED ARTICLES

Most Popular