https://oktelugu.com/

కరోనా కొత్త స్ట్రెయిన్.. ప్రపంచం అప్రమత్తం..!

కరోనా పేరుచెబితేనే ప్రపంచం వణికిపోతుంది. 2020 తొలినాళ్లలో చైనాలో మొదలైన కరోనా ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు కరోనా అడ్వాన్స్ గా వర్షన్ గా మరో కొత్తరకం వైరస్ ను ప్రపంచం మీదికి వదిలింది. Also Read: తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లలకు వేగంగా సోకుతున్న కొత్తరకం కరోనా..? ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ తో మానవళి మొత్తం ఇబ్బందులు పడుతోంది. దీనికితోడు కొత్తరకం వైరస్ లు పుట్టుకొస్తుండటం ప్రపంచానికి పెనుసవాలుగా మారుతోంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 23, 2020 / 11:51 AM IST
    Follow us on

    కరోనా పేరుచెబితేనే ప్రపంచం వణికిపోతుంది. 2020 తొలినాళ్లలో చైనాలో మొదలైన కరోనా ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు కరోనా అడ్వాన్స్ గా వర్షన్ గా మరో కొత్తరకం వైరస్ ను ప్రపంచం మీదికి వదిలింది.

    Also Read: తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లలకు వేగంగా సోకుతున్న కొత్తరకం కరోనా..?

    ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ తో మానవళి మొత్తం ఇబ్బందులు పడుతోంది. దీనికితోడు కొత్తరకం వైరస్ లు పుట్టుకొస్తుండటం ప్రపంచానికి పెనుసవాలుగా మారుతోంది.

    కరోనా కొత్తరకం వైరస్ బ్రిటన్.. యూరప్ దేశాల్లో వెలుగు చూడటంతో ఆయా దేశాలు లాక్డౌన్ దిశగా వెళుతున్నాయి. బ్రిటన్.. యూరప్.. దక్షిణాఫ్రికా దేశాల్లో క్రిస్మస్.. న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశారు.

    బ్రిటన్లో వెలుగు చూసిన కొత్తరకం స్ట్రెయిన్ తో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ 70శాతం అధికంగా వ్యాపి చెందుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ వైరస్ ఒక్క బ్రిటన్ కే పరిమితమా? లేదా ప్రపంచం వ్యాప్తంగా ఉందా? అనేది తేలాల్సి ఉంది.

    Also Read: కొత్తరకం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటిలోగా వస్తుందంటే?

    ఈ విషయాన్ని నిపుణులు ఇప్పటికే తేల్చే పనిలో పడ్డారు. ఇక కరోనా కొత్తరకం వైరస్ తో అన్ని దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎయిర్ పోర్టుల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ కరోనా టెస్టులు చేస్తున్నారు.

    అనుమానితులను క్వారంటైన్ కు పంపుతున్నారు. కాగా ఇప్పటికే కొనుగొన్న కరోనా వ్యాక్సిన్ కొత్తరకం వైరస్ పై పని చేస్తుందా? లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతోన్నాయి. అయితే దీనికి ఆరువారాల్లోనే వ్యాక్సిన్ తయారు చేయచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    కొత్తరకం వైరస్‌ ఎఫెక్ట్‌తో అతి చిన్న దేశమైన భూటాన్‌ కూడా తాజాగా లాక్‌డౌన్ ప్రకటించింది. ఇక భారత్‌లోను ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు బహిరంగ వేడుకలను రద్దు చేసుకోవాలని కోరుతున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్