Jabardasth to Biggboss: జబర్ధస్త్ నుంచి బిగ్ బాస్ లోకి మరో వికెట్?

సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే అందులో పాల్గొనే కంటెస్టెంట్లు అందరూ ఇప్పటికే క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్టుగా చెబుతున్నారు. వాళ్లు ఎవరూ అనేది స్టార్ మా చానెల్ బయట పెట్టడం లేదు. హోస్ట్ నాగార్జున మరోసారి ఈ షోను హోస్ట్ చేస్తున్నట్టు మాత్రం ఒక ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హీట్ పతాక స్థాయికి చేరింది. ఎవరెవరు బిగ్ బాస్ లోకి వెళుతున్నారన్న దానిపై సోషల్ […]

Written By: NARESH, Updated On : August 23, 2021 4:40 pm
Follow us on

సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే అందులో పాల్గొనే కంటెస్టెంట్లు అందరూ ఇప్పటికే క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్టుగా చెబుతున్నారు. వాళ్లు ఎవరూ అనేది స్టార్ మా చానెల్ బయట పెట్టడం లేదు. హోస్ట్ నాగార్జున మరోసారి ఈ షోను హోస్ట్ చేస్తున్నట్టు మాత్రం ఒక ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హీట్ పతాక స్థాయికి చేరింది. ఎవరెవరు బిగ్ బాస్ లోకి వెళుతున్నారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

జబర్ధస్త్ నుంచి కమెడియన్లు బిగ్ బాస్ లో పాల్గొనడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇప్పటికే పోయిన సారి ముక్కు అవినాష్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది సీజన్ 4 కోసం ఏంకగా జబర్ధస్త్ కు తిరిగి రూ.10లక్షలు కట్టి మరీ బిగ్ బాస్ ఇంటికి వెళ్లాడు. గత ఏడాదియే రోహిణీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. ఇప్పుడు మరో బ్యూటీ కూడా బిగ్ బాస్ లోకి వెళుతోంది.

జబర్ధస్త్ కామెడీ షోలో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న వర్ష.. ఇప్పుడు బిగ్ బాస్ ఇంటికి వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇమ్మాన్యూయేల్ తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ బ్యూటీ భాస్కర్ సహా పలువురి టీంలో కీలక మెంబర్ గా ఉన్నారు. తన అందంతో కామెడీ టైమింగ్ తో ఈమె ఆకట్టుకుంటుంది.

జబర్ధస్త్ నుంచి బిగ్ బాస్ లోకి రావడానికి వర్షకు భారీగానే పారితోషికం ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక సారి జబర్ధస్త్ వదిలేస్తే అక్కడ డబ్బులు తిరిగి కట్టడంతోపాటు మళ్లీ అందులోకి వెళ్లడానికి రూల్స్ ఒప్పుకోవు. ఈ క్రమంలోనే వర్ష అన్ని వదిలేసుకొని బిగ్ బాస్ లోకి వస్తుందా? రాదా? అన్నది చూడాలి.