Homeఎంటర్టైన్మెంట్Indraja: నా పిల్లలకు నువ్వు .... నటి ఇంద్రజ పై జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

Indraja: నా పిల్లలకు నువ్వు …. నటి ఇంద్రజ పై జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

Indraja: బుల్లితెర పై సందడి మొత్తం ఇంద్రజదే. సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే… జబర్దస్త్(Jabardasth), శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) షోలలో ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇంద్రజ పై ఓ కమెడియన్ వేసిన పంచులకు ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎలా రియాక్ట్ కావాలో తెలియక షాకింగ్ ఎక్సప్రెషన్స్ పెట్టింది. ఇంతకీ అతను ఇంద్రజ ను ఏమని కామెంట్ చేశాడు. ఇంద్రజ అంతగా ఫీలైపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంద్రజ ప్రత్యేక ఆకర్షణ. అయితే కమెడియన్స్ అప్పుడప్పుడు ఆమె మీద పంచ్లు వేస్తుంటారు.కాగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు(Nukaraju) ఇంద్రజ పరువు తీసేశాడు. నూకరాజు ఆమెపై వేసిన సెటైర్లు హిలేరియస్ గా పేలాయి. నూకరాజు ఎక్కువగా జడ్జి ఇంద్రజ పై పంచులు వేస్తూ కామెడీ చేస్తుంటాడు. ఇక తాజా ఎపిసోడ్ లో కూడా ఇదే చేశాడు. ఎప్పుడూ ఇంద్రజ తన తల్లి లాంటిది అని చెప్పే నూకరాజు ఈసారి ఏకంగా ఆమెను నాయనమ్మ అనేశాడు.

Also Read: Sridevi Drama Company: సుధీర్ బాబు ఏంటి అంత మాట అన్నాడు… పాపం రష్మీ ఆవేశంలో పరువు పోగొట్టుకుందిగా!

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలో నూకరాజు ఒక స్కిట్ చేశాడు. ఇందులో భాగంగా కొన్ని పాటలను స్పూఫ్ చేసి పాడాడు. ” రాంప్రసాద్ వచ్చి డాన్స్ చేస్తే, ఇంద్రజ గారు జడ్జిమెంట్ ఇస్తే .. జడ్జిమెంట్ అంటే అందరికీ మంటే .. ఓయమ్మా ఇంద్రజమ్మా నా పిల్లలకు నువ్వు నయనమ్మా” అంటూ ఆట పట్టించాడు.

Also Read: Sudigali Sudheer: పెళ్లి కాని సుడిగాలి సుధీర్ కి అంత పెద్ద కూతురు ఉందా… ఇదేం ట్విస్ట్ సామీ!

దీంతో సెట్ మొత్తం నవ్వేశారు. ఇక ఇంద్రజ ఐతే అటు నవ్వలేక నూకరాజును ఏమి అనలేక సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత నూకరాజు ఫైమా ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. అనంతరం తెలంగాణ కోసం పోరాడి అమరులైన వారిని గుర్తు చేస్తూ కొన్ని ఎమోషనల్ సాంగ్స్ పాడి అందరినీ ఏడిపించేశాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో వైరల్ అవుతుంది.

Sridevi Drama Company Latest Promo | 2nd June 2024 | Rashmi,Indraja, Ramprasad | ETV Telugu

Exit mobile version