
Avinash Marriage: అందరికి సుపరిచితమయిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో నే కాదు దానిలో ఉండే టీం సభ్యులు కూడా అంతే సుపరిచితమే. అలా జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నజబర్దస్థ్ ముక్కు అవినాష్ ఒక ఇంటి వాడు అయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దల అంగీకారం తో ఒక్కటయ్యారు ఈ జంట.
ఈటీవీ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్(Avinash Marriage) వివాహ వేడుక ఘనం గా జరిగింది. అవినాష్ చిన్ననాటి స్నేహితురాలైన తనుజాని పెద్దల సమక్షం లో వివాహమాడాడు. ఆ వివాహ వేడుకకి జబర్దస్త్ టీం తో పాటు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ కి సంబందించిన పలువురు ప్రముఖులు వచ్చి నూతన వధూవరులని ఆశీర్వదించారు. అంతే కాకుండా తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన శ్రీముఖి, ఆర్జే చైతు శ్రీముఖి తమ్ముడు.. అనినాష్ పెళ్లి వేడుక లో పాల్గొని రచ్చ రచ్చ చేసి వాటి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇదిలా ఉండగా అవినాష్ సహా నటుడు డు. ఇప్పటికే ప్రతి ఒక్క సెలబ్రిటీకి తమ సొంత యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి తెల్సిందే. అలా ముక్కు అవినాష్ కి కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. అలా తన యూట్యూబ్ ఛానల్ లో పెళ్ళికి సంబందించిన పెళ్లి వీడియోని పోస్ట్ చేసి అభిమానులని సర్ ప్రైజ్ చేద్దామనుకున్నాడు. అంతలోనే ఆటో రాంప్రసాద్ పెళ్ళికి సంబందించిన వీడియో ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో షేర్ చేసి అవినాష్ ని ఆశ్చర్య పరిచాడు.