Jabardast Rakesh-Jordar Sujata : జబర్దస్త్ లో రాకింగ్ రాకేశ్ అంటే తెలియని వారు ఉండరు కదా.. ఎందుకంటే అన్ని టీముల్లో పెద్దవారు ఉంటే.. రాకింగ్ రాకేశ్ టీములో మాత్రం పిల్లలు ఉంటారు. పిల్లలతో నెట్టుకస్తున్నాడని, వారు లేకుంటే గెలుపే లేదని అందరూ కామెంట్లు చేస్తుంటారు. కానీ తనకు పిల్లలంటే చాలా ఇష్టమని తన బాల్యం చాలా కష్టాలు పడిందని చెప్పి చాలా సార్లు కన్నీరు తెప్పించారు రాకేశ్. రాకేశ్ తన కో ఆర్టిస్ట్ అయిన సుజాతను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం 2023, ఫిబ్రవరి 24న జరిగింది. వీరిది అన్యోన్యమైన కాపురం. చిన్న చిన్న కలతలు ఉన్నా సర్ధుకుని ఆనందంగా ఉంటారు. పైగా ఇద్దరూ మంచి తెలంగాణ యాసలో ఇంట్లో సరసాలాడుకుంటామని చెప్తారు. సుజాత డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ కు వచ్చింది. మొదట ఆన్ లైన్ మార్కెటింగ్ జాబ్ చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై అవకాశం కోసం పాకులాడింది. వీ6లో అవకాశం దక్కింది. దీని తర్వాత హెచ్ఎం టీవీలో అవకాశం దక్కడంతో యాంకర్ గా ‘జోర్దార్ సుజాత’గా గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా చేసింది.
జబర్దస్త్ రాకేష్-జోర్దార్ సుజాతకు పండండి బిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా వారు వివరించారు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు. సుజాత తన ఇన్ స్టాలో ఇలా క్యాప్షన్ పెట్టారు. (ఈ నవరాత్రి పర్వదినాలలో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది హాస్పిటల్లో నేను అనుభవించిన ఆ సంఘటన ఓ అద్భుతం
మా అమ్మని ఎంతో బాధ పెడుతూ ఈ లోకంలోకి వచ్చిన నేను ప్రత్యక్షంగా ఆ బాధను చూస్తూ తండ్రిని తండ్రినయ్యాను ఈ జన్మలో ఏ బాధ నిన్ను దరిచారనివ్వమ్మా
నా బాధలో నా ఆనందంలో సగమైన నా సుజాత ఓ బిడ్డకి తల్లిగా నా కుటుంబానికి మరో అమ్మగా పరిపూర్ణ స్త్రీగా మారిన ఓ అద్భుత క్షణం ఆ దేవుడు ఆశీస్సులతో త్వరలో కోల్కొని నీ షూటింగ్లలో బిజీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
నన్ను సుజాత ని మొదటి నుంచి మీ ఆశీస్సులతో పాజిటివ్ ఎనర్జీ తో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు ఇలానే మీ ఆశీస్సులు మా పాప మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను❤️❤️) అంటూ రాకింగ్ రాకేష్ పోస్ట్ వేశాడు. జబర్దస్త్ వేదికగా ఏర్పడిన పరిచయం.. పెళ్లి వరకు దారి తీసింది.
ఇక తన పండంటి బిడ్డ రాకతో రాకేష్-సుజాతల జీవితంలో మరో కొత్త దశ మొదలైంది. రాకేష్ బుల్లితెర షోలతో కాస్త బిజీగానే మారారు. కేసీఆర్ అంటూ ఓ సినిమా చేశారు. కానీ దాని ఊసే లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో సుజాత కూడా బిజీగానే ఉంది. సేవ్ ది టైగర్స్, సేవ్ ది టైగర్స్ సీక్వెల్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. సుజాత గర్భంతో ఉండడంతో ఇన్ని రోజులు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
త్వరలో మళ్లీ షూటింకు వచ్చి అందరినీ కలుస్తానని సుజాత చెప్తోంది. ఏది ఏమైనా ఆమె తన బిడ్డతో ఏడాది వరకు గడపాలి. ఆ తర్వాత మాత్రమే షూటింగ్ కు వెళ్లగలదు. కాబట్టి తనపై షూట్లను ఏడాదికి పోస్ట్ పోన్ చేసుకోవాలని తన నిర్మాతలు, దర్శకులను కోరింది సుజాత.