Income Tax : భారతదేశ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం స్థాయికి మించి ఆదాయం ఉన్న వారు ఆదాయ పన్నును కట్టాల్సిందే. ఇవే కాకుండా వస్తు సేవల పన్ను తదితరాలుప్రభుత్వానికి పరోక్షంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో కచ్చితంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని షేర్స్ కొనుగోలు చేసినా.. విక్రయించినా.. వాటిలో కొంత భాగం ప్రభుత్వానికి వెళ్తుంది. ముఖ్యంగా భారీ ఎత్తున స్టాక్ మార్కెట్లో పెట్టుబుడులు పెట్టి వాటిని విక్రయించగా డబ్బు వస్తే ఆ డబ్బును తీసుకునే సమయంలో ఆదాయపు పన్ను చెల్లించాలి. కానీ ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆది ఏ సమయంలో అంటే?
ట్రేడింగ్ వ్యాపారంపై కొంత మందికి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. స్వల్ప కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకునేవారికి ఈ రూట్ బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాభ పడిన వారితో పాటు భారీగా నష్టపోయిన వారు ఉన్నారు. అందువల్ల దీనిపై పూర్తిగా అవగాహన వచ్చిన తరువాతే ఇందులో అడుగుపెట్టాలి. అయితే నిపుణుల సాయంతో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ మెంట్ చేస్తూ ఉండాలి. ప్రస్తుత కాలంలో లాంగ్ టర్న్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసుకుంటూ పోవడం వల్ల ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చిన మొత్తంతో ఏదైనా ప్రత్యేక అవసరాన్ని తీర్చుకోవచ్చు. వీటిలో ఇల్లు నిర్మించుకోవడం ప్రధానంగా ఉంటుంది.
సొంత ఇల్లు కట్టుకోవడానికి చాలా మంది కలలు కంటూ ఉంటారు. కొందరు దీనిని జీవిత లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని డబ్బును ఆదా చేసుకుంటూ ఉంటారు. అయితే స్టాక్ మార్కెట్ పై అవగాహన వచ్చిన వారు ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేసుకుంటూ పోవడం వల్ల ఎక్కువ లాభం వస్తుందని ఆశ పడేవాళ్లు కొన్నాళ్లు వెయిట్ చేస్తారు. ఇలా టైం తీసుకున్న వారికి లాభం కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా సిప్ లాంటి వాటిల్లో లాభమే గాని నష్టం ఉండదు.
అయితే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసి వచ్చిన రిటర్న్స్ తో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఇలాంటి ఆలోచన ఉన్న వారికి ప్రభుత్వం సాయం చేస్తుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ చేసిన వీటిపై వచ్చిన లాభంతో ఇల్లు కట్టుకోవాలని చూస్తే ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సెక్షన్ 54 ఎఫ్ ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ చేయగా.. వచ్చిన లాభంతో ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు ఎలాంటి ట్యాక్స్ పే చేయకున్నా పర్వాలేదు. అయితే ఈ డబ్బుతో 2 సంవత్సరాలలోపు కచ్చితంగా ఇల్లు కోసం వెచ్చించాల్సినట్లు ప్రభుత్వానికి ఆధారం చూపించాల్సి ఉంటుంది. దీంతో ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు కొన్నాళ్ల పాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభం వచ్చిన తరువాత ట్యాక్స్ మినహాయింపును పొందవచ్చు.