https://oktelugu.com/

Kia EV : ఖరీదైన ఈవీ కొనాలని చూసేవారికి కియా గుడ్ న్యూస్.. ఫీచర్స్ మైండ్ బ్లాక్..

దేశంలోని ప్రముఖ కంపెనీ కియా తాజాగా కొత్త ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి నుంచి రిలీజ్ అయిన రెండో కారుగా ఉన్న ఈ మోడల్ ప్రపంచంలోనే ప్రత్యేకత సాధించింది. ఇందులో ఉన్న ఆ విశేషాలెంటో తెలుసుకోండి..

Written By:
  • Srinivas
  • , Updated On : October 5, 2024 / 05:37 PM IST

    Kia EV

    Follow us on

    Kia EV : దేశంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎగబడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండడంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలని అనుకునేవాళ్లు ఈవీ ల వైపే మళ్లుతున్నారు. వాతావరణం కాలుష్య, మైలేజ్ ని మాత్రమే కాకుండా ఈవీలు ఇప్పుడు ప్రీమియం రేంజ్ లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. లగ్జరీ కార్లు కొనాలని ఎదురుచూస్తున్న ధనికులు, సెలబ్రెటీల కోసం ఈవీల్లోనూ అధునాతన కార్లు వస్తున్నాయి. దేశంలోని ప్రముఖ కంపెనీ కియా తాజాగా కొత్త ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి నుంచి రిలీజ్ అయిన రెండో కారుగా ఉన్న ఈ మోడల్ ప్రపంచంలోనే ప్రత్యేకత సాధించింది. ఇందులో ఉన్న ఆ విశేషాలెంటో తెలుసుకోండి..

    కియా కార్లకు మార్కెట్లో మంచి పేరు ఉంది. దీని నుంచి మొదటిసారిగా EV6 ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిని ఎక్కువగా సినీ స్టార్స్, సెలబ్రెటీలు కొనుగోలు చేస్తున్నారు. తాజాగా మరో ఎలక్ట్రిక్ కారు EV 9 SUV ని లాంచ్ చేసింది. ఇది జీటీ లైన్ అనే ఒకే మోడల్ లో నే అందుబాటులో ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఈవీ 9 ఎస్ యూవీ కి మంచి పేరు వచ్చింది. 2024లో వరల్డ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. దీనిని ఇప్పుడు భారత మార్కెట్లోకి తీసుకు రావడంతో అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

    కియా కొత్త కారులో 282. 6 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. దీనిపై ఈ మోడల్ 561 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బ్యాటరీపై 379 బీహెచ్ పీ పవర్ 700 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ఛార్జింగ్ కావడానికి 24 నిమిషాలు మాత్రమే కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 5.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లే వేగంతో ఉన్న ఇందులో ఎల్ ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ టైగర్ ఫేస్ ఉంది. అలాగే అగ్రెసివ్ ఫేసియా లుక్ ను కలిగి ఉంది.

    కియా ఈవీ 9 డిజైన్ ఆకర్షణీయమైన లుక్ ను కలిగి ఉంది. ఇన్నర్ లో 3100 ఎంఎం వీల్ బేస్ ను కలిగి ఉండి మూడు వరుసల సీట్లు ఉన్నాయి. దీంతో ప్రతీ వరుసలో ఇద్దరు కలిపి మొత్తం 6గురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇంటీరియర్ లో క్లీన్ డిజైన్ డ్యాష్ బోర్డున కలిగిన ఈ కారులో డిజిటల్ ఇన్ స్ట్రూమెంటర్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిస్ ప్లే ఉన్నాయి. ఎలాంటి పెద్ద రోడ్ లో నైనా రయ్ మని దూసుకెళ్లే విధంగా అటానమోస్ డ్రైవింగ్ అసిస్ట్ ఫీచర్లను కలిగి ఉంది.

    ఈ కొత్త మోడల్ బెస్ట్ సేప్టీ ఫీచర్స్ ను కూడా కలిగి ఉంది. ఇందులో 10 ఎయిర్ బ్యాగ్స్, అడాప్టాివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫరార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అండ్ వాయిస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఖరీదైన కార్ల సరసన నిలిచే ఈ కారు బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడి క్యూ 8 ఈ ట్రోన్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.