Homeఎంటర్టైన్మెంట్Itlu Arjuna Movie: 'ఇట్లు అర్జున' మూవీ ఫుల్ రివ్యూ..కొత్త కుర్రాడు హైప్ ని మ్యాచ్...

Itlu Arjuna Movie: ‘ఇట్లు అర్జున’ మూవీ ఫుల్ రివ్యూ..కొత్త కుర్రాడు హైప్ ని మ్యాచ్ చేశాడా లేదా ?

Itlu Arjuna Movie: ఈమధ్య కాలం లో ఒక సినిమాకు హైప్ తీసుకొని రావడం చాలా పెద్ద టాస్క్. హైప్ ఉంటేనే ఓపెనింగ్స్ వచ్చే రోజులివి. పెద్ద హీరోల సినిమాలకు సైతం ఈమధ్య కాలంలో హైప్ రానటువంటి సందర్భాలను మనం చాలానే చూశాము. అలాంటి ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో ఒక కొత్త హీరో సినిమా కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూసే అరుదైన సంఘటన ‘ఇట్లు అర్జున’ చిత్రంతో ఎదురైంది. అనీష్ అనే కొత్త కుర్రాడు […]

Itlu Arjuna Movie: ఈమధ్య కాలం లో ఒక సినిమాకు హైప్ తీసుకొని రావడం చాలా పెద్ద టాస్క్. హైప్ ఉంటేనే ఓపెనింగ్స్ వచ్చే రోజులివి. పెద్ద హీరోల సినిమాలకు సైతం ఈమధ్య కాలంలో హైప్ రానటువంటి సందర్భాలను మనం చాలానే చూశాము. అలాంటి ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో ఒక కొత్త హీరో సినిమా కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూసే అరుదైన సంఘటన ‘ఇట్లు అర్జున’ చిత్రంతో ఎదురైంది. అనీష్ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రం తో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. అనశ్వర రాజన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా , డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వ్యవహరించాడు. అక్కినేని నాగార్జున ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ , అఖిల్ వంటి వారు ఈ సినిమాని చాలా బలంగా ప్రమోట్ చేశారు. ఇంతటి భారీ హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు అలరించిందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ విషయానికి వస్తే పెద్దన్న కి సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయిలు హవాలా రూపం లో చేతులు మారే సమయంలో ఒక హెల్మెట్ కుర్రాడు వచ్చి ప్లాన్ మొత్తాన్ని పాడు చేస్తాడు. ఒక పెన్ డ్రైవ్ లో ఈ వెయ్యి కోట్ల హవాలా కి సంబంధించిన సమాచారం ఉంటుంది. దీని కోసం అడ్డుకొచ్చిన ఆ హెల్మెట్ కుర్రాడి కోసం పెద్దన్న మనుషులు తీవ్ర స్థాయిలో గాలిస్తుంటారు. మరోవైపు హైదరాబాద్ లో అర్జున్ కథ సమాంతరంగా నడుస్తూ ఉంటుంది. ఇతనికి మాటలు రావు , కానీ చాలా తెలివైనోడు. చిన్న తనం నుండి తన తండ్రితో కలిసి అర్జున్ అనేక దొంగతనాలు చేసేవాడు. దీంతో ఇతనికి దొంగ అనే ముద్ర చాలా బలంగా పడిపోయి ఉంటుంది.

అయితే ఒకానొక సమయంలో తండ్రి కొడుకులిద్దరూ ఒక దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడుతారు. దాంతో చిన్నతనం నుండే అర్జున్ కి జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత అతనికి కీర్తి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ అర్జున్ ఆమెకి తన లవ్ ని ప్రపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మూగవాడు అవ్వడం తో తన ప్రేమని తెలపలేక తనలో తానూ కుమిలిపోతూ ఉంటాడు. అయితే ఈ క్రమం లో అనుకోకుండా అర్జున్ , కీర్తి వెయ్యి కోట్ల హవాలా వ్యవహారం లో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదే మిగిలిన స్టోరీ.

ఒక కొత్త హీరోతో ఇలాంటి కథ ని తెరకెక్కించాలని అనుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. తొలిసినిమాతోనే మాటలు రాని వాడిగా అనీష్ చాలా అద్భుతంగా నటించాడు. ఇది ఆయనకు మొదటి సినిమా అంటే అసలు నమ్మరేమో , ఆ రేంజ్ లో నటించాడు. కథ , స్క్రీన్ ప్లే కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సందర్భానుసారం వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా చాలా ఆర్గానిక్ గా అనిపించాయి. కథ నుండి ఎక్కడా డీవియేట్ అవ్వకుండా , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఫస్ట్ హాఫ్ ని ముగించాడు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ అయితే వెయ్యి కోట్ల హవాలా చుట్టూనే స్క్రీన్ ప్లే నడుస్తుంది. కొన్ని ట్విస్టులు పర్వాలేదు అనిపిస్తాయి. అయితే విలన్ ముఖేష్ రిషి క్యారెక్టర్ కాస్త రొటీన్ గా అనిపించింది.

డైరెక్టర్ ఆయన పాత్రని సరిగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త తగ్గినప్పటికీ, ఒక మంచి సినిమాని చూశాము అనే ఫీలింగ్ తోనే థియేటర్ నుండి బయటకు వస్తాము. తమన్ అందించిన పాటలు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈమధ్య కాలం లో వచ్చిన కమర్షియల్ సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.75/5.. ఈ చిత్రాన్ని మీరు కూడా చూసారా?, చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper