DNK Movie: యూట్యూబర్ స్థాయి నుండి సినీ హీరో గా ఎదిగిన వారిలో ఒకరు మౌళి. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం లో హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన మౌళి, మొదటి సినిమాతోనే కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మౌళి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగా ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దొంగ నా కొడుకు’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన క్షణం నుండే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. పైగా టీజర్ , ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం తో యూత్ ఆడియన్స్ ఈ చిత్రం కోసం బాగా ఎదురు చూసారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ ని అలరించిందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.
ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే , మౌళి ఆడియన్స్ అంచనాలకు మించే కామెడీ ని పండించాడనే చెప్పాలి. స్క్రీన్ మీద ఆయన కనిపించినంత సేపు నవ్వులు పూయిస్తూనే ఉన్నాడు. జెన్ జీ ఆడియన్స్ కోసం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమి పెట్టలేదు , కేవలం ఆర్గానిక్ కామెడీ తోనే ఆయన కితకితలు పెట్టాడు. ఈమధ్య కాలం లో ఇలాంటి కామెడీ ఉన్న సినిమా రాలేదని , మౌళి మరోసారి సిక్సర్ కొట్టేశాడని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో హీరో తన కుటుంబానికి ఇచ్చే ఒక ట్విస్ట్ వేరే లెవెల్ లో ఉంది, ఆడియన్స్ ఆ ట్విస్ట్ కి మెంటలెక్కిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మౌళి, బబ్లూ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు హిలేరియస్ గా ఉన్నాయి. థియేటర్స్ లో ప్రేక్షకులు వీళ్లిద్దరి కామెడీ కి నవ్వుతూనే ఉన్నారు. ఇకపోతే ఈ చిత్రం లో సీనియర్ కమెడియన్ అలీ హీరో కి తండ్రి క్యారెక్టర్ చేసాడు. చాలా కాలం తర్వాత అలీ కి మంచి క్యారెక్టర్ పడిందని చెప్పొచ్చు.
ఇక సెకండ్ విషయానికి వస్తే డైరెక్టర్ కామెడీ కి తోడు క్రైమ్ ఎలిమెంట్ ని కూడా జోడించాడు. ఈ రెండిటిని మిక్స్ చేస్తే వచ్చే ఫన్నీ ఎలిమెంట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఓవరాల్ గా కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రానికి వెళ్లి కడుపుబ్బా నవ్వుకొని ఎంజాయ్ చేయొచ్చు. కచ్చితంగా ఈ చిత్రం కమర్షియల్ గా చాలా పెద్ద రేంజ్ కి వెళ్తుంది, ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ చిత్రానికి శింజిత్ మ్యూజిక్ ని అందించిన సంగతి తెలిసిందే. ఆయన మ్యూజిక్ కూడా అదిరిపోయే రేంజ్ లోనే ఉంది . పాటలు పెద్దగా క్లిక్ అవ్వలేదు కానీ , నేపధ్య సంగీతం మాత్రం మరో లెవెల్ లో ఉందని అంటున్నారు. ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ సినిమాని మీరు ఇది వరకే చూసారా?, చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.