https://oktelugu.com/

Trivikram Srinivas: త్రివిక్రమ్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని వదిలి పెడితే మంచిది…

అజ్ఞాతవాసి సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రాలేదు. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలన్నా కూడా దానికి త్రివిక్రమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ముందుగా త్రివిక్రమ్ ఆ కథ విని దాన్ని ఒకే అంటేనే ఆ సినిమా పట్టాలెక్కుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 18, 2024 / 10:14 AM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అందులో అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక జల్సా సినిమా సూపర్ హిట్ గా నిలువగా, అజ్ఞాతవాసి సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రాలేదు. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలన్నా కూడా దానికి త్రివిక్రమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ముందుగా త్రివిక్రమ్ ఆ కథ విని దాన్ని ఒకే అంటేనే ఆ సినిమా పట్టాలెక్కుతుంది.

    ఒకవేళ ఏదైనా సినిమాని రీమేక్ చేయాలన్న కూడా దాన్ని త్రివిక్రమ్ తెలుగు నేటివిటీ కి తగ్గట్టు గా మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ స్టోరీ ని మార్చిన తర్వాత అప్పుడు డైరెక్టర్ ను తీసుకొని ఆ సినిమాను ఆయన చేత డైరెక్షన్ చేయిస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలన్నా కూడా త్రివిక్రమ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఇలాంటి క్రమం లో త్రివిక్రమ్ తన సొంత సినిమాలను సైతం పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ కోసం ఇలా స్క్రిప్ట్ లు రెడీ చేస్తూ ఉండటం వల్ల తన సొంత సినిమాల మీద ఫోకస్ చేసుకోలేకపోతున్నాడు అంటూ కొంతమంది త్రివిక్రమ్ అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఈ సంక్రాంతి కానుక గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా పరిస్థితి కూడా అలానే అయిందంటూ మరి కొంతమంది వాపోతున్నారు. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేయడం మంచిదే, కానీ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు సినిమాని చేతిలో పెట్టుకొని మహేష్ బాబు డేట్స్ ని దగ్గర ఉంచుకొని మరి పవన్ కళ్యాణ్ తో సినిమాలో మునిగిపోవడం తన సినిమాని పక్కన పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం త్రివిక్రమ్ తీరు పైన విమర్శలను సందిస్తున్నారు.

    ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మా హీరో చేత ఈ త్రివిక్రమ్ అన్ని వరస్ట్ సినిమాలను చేయిస్తున్నాడు అంటూ వాళ్లు కూడా గురూజీని విమర్శిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి అటు మిగితా హీరోల అభిమానుల నుంచి త్రివిక్రమ్ మీద నెగిటివ్ టాక్ వస్తుంది కాబట్టి ఇప్పటికైనా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ను వదిలిపెట్టి తన సినిమాల మీద ఫోకస్ చేసుకుంటే మంచిది అని అందరు అభిప్రాయపడుతున్నారు…