https://oktelugu.com/

Naveen Vadde: వడ్డే నవీన్ చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఆయనని తోక్కేసిన నందమూరి ఫ్యామిలీ…అసలేం జరిగిందంటే..?

నవీన్ నందమూరి ఫ్యామిలీకి రిలేటివ్ అవడంతో నవీన్ కి చాలా సినిమాల ఆఫర్స్ వచ్చాయి అలా ఆయన సినిమా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో హీరోయిన్ మహేశ్వరి తో ఆయనకి సనిహిత్యం ఏర్పడటం ఆమెతో ఎక్కువ సినిమాలు చేయడం ఇక ఆ తర్వాత వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉంటున్నారు.

Written By: , Updated On : October 22, 2023 / 02:36 PM IST
Naveen Vadde

Naveen Vadde

Follow us on

Naveen Vadde: సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదుగుదామని కొద్దిరోజులపాటు హీరోగా సక్సెస్ అయి ఆ తర్వాత చాలా ప్లాప్ లను ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి ఫెడ్ ఔట్ అయిపోయిన హీరోలలో నవీన్ ఒకరు. నవీన్ వాళ్ల నాన్న వడ్డే రమేష్ ఇండస్ట్రీ లో పెద్ద ప్రొడ్యూసర్ అవ్వడం తో ఈయన చేసిన సినిమాలు మొదట్లో మంచి విజయాలను అందుకున్నాయి.అయితే ఈయన కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయం అందుకున్నాడు.ఇక ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో నవీన్ స్టార్ హీరో అయిపోతాడు అని అందరూ అనుకున్నారు కానీ వరుస ప్లాప్ లు రావడం తో ఇండస్ట్రీలో ఈయన కి ఎక్కువగా అవకాశాలను అందుకోలేకపోయాడు.
ఇక దాంతో నవీన్ వాళ్ళ నాన్న వడ్డే రమేష్ పెద్ద ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగడంతో ఆయన తీసిన సినిమాలు చాలావరకు ఎన్టీఆర్ గారితో ఉండడంవల్ల అలాగే ఆయన దాసరి నారాయణరావు తో ఎక్కువ సినిమాలు చేసి ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యంతో ఎన్టీయార్ పెద్ద కుమార్తె అయిన లోకేశ్వరి కూతురు అయిన చాముండేశ్వరి ని నవీన్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని దసరా నారాయణ రావు గారితో ఎన్టీఆర్ గారిని అడిగించడం జరిగింది. ఈ విషయం మీద ఎన్టీఆర్ గారు బతికున్నప్పుడు ఆయనతో మాట్లాడినప్పటికీ ఎన్టీయార్ గారు ఒకే అన్నారు.ఇక ఆయన అనుకోకుండా మరణించడం జరిగింది. దాంతో ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళకి పెళ్లి చేయడం జరిగింది.

ఇక దాంతో నవీన్ నందమూరి ఫ్యామిలీకి రిలేటివ్ అవడంతో నవీన్ కి చాలా సినిమాల ఆఫర్స్ వచ్చాయి అలా ఆయన సినిమా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో హీరోయిన్ మహేశ్వరి తో ఆయనకి సనిహిత్యం ఏర్పడటం ఆమెతో ఎక్కువ సినిమాలు చేయడం ఇక ఆ తర్వాత వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉంటున్నారు అనే విషయం తెలిసి చాముండేశ్వరి నవీన్ నుంచి విడాకులు తీసుకుని సపరేట్ అయిపోయింది.ఇక అప్పటినుంచి నవీన్ నందమూరి ఫ్యామిలీ కి దూరం అవ్వడంతో అప్పటివరకు నవీన్ హీరోగా చేస్తున్న సినిమాలన్నింటిని నందమూరి ఫ్యామిలీ వాళ్ళ పలుకుబడితో ఆ సినిమాలో నుంచి నవీన్ ని హీరోగా తీసి వేయించి వేరే వాళ్ళని పెట్టుకుని ఆ సినిమాలు చేసేలా చేశారు.దాంతో నవీన్ కెరియర్ అనేది ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాలేకపోయింది…

అయితే ఆయన ఈ మధ్య వర్మ తీసిన ఎటాక్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వకపోవడం తో ఆయనకి అసలు ఏ విధమైన పేరు రాలేదు ఇక దాంతో ఆయన కంప్లీట్ గా సినిమాలకి దూరం అయిపోయాడు…