Allu Aravind: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి కలతలు లేకుండా ఎల్లప్పుడూ కలిసి ఉండే కుటుంబం ఏదైనా ఉందా అంటే అది మెగా ఫ్యామిలీ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అందరూ ఒక్కటే..కానీ ఒక్కొక్కరికి హిట్టు మీద హిట్టు పడుతూ సొంత స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత మెగా హీరోల మధ్యనే పోటీ తత్త్వం బాగా ఏర్పడింది..ఆ పోటీ తత్త్వం ప్రధానం గా రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ మధ్యన ఏర్పడింది.

ఇద్దరు ఇద్దరే..దేశం గర్వించదగ్గ స్టార్ హీరోలలో వీళ్లిద్దరు ప్రధమ వరుసలో వస్తారు..అలాంటి స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత కచ్చితంగా పోటీ ఉంటుంది..ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య తరుచు సోషల్ మీడియా లో ఎలాంటి ఫ్యాన్ వార్స్ నడుస్తూ ఉంటాయో మన అందరికి తెలిసిందే..ఫాన్స్ ఎలా కొట్టుకున్నా వీళ్లిద్దరు సొంత బావబామ్మర్దులు..వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ వేరు..కానీ మీడియా గత కొంత కాలం నుండి మెగా ఫామిలీ రెండు వర్గాలుగా చీలిపోయింది..ఒకటి మెగా కుటుంబం కాగా మరొకటి అల్లు కుటుంబం అంటూ కథనాల మీద కథనాలు ప్రసారం చెయ్యడం ప్రారంభించాయి.
ఈ కథనాలు చూసి అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా చిరంజీవి కుటుంబానికి మరియు అల్లు కుటుంబానికి మధ్య పడడం లేదని నమ్మేశారు..అయితే అల్లు అరవింద్ ఇటీవల అలీతో సరదాగా అనే ప్రోగ్రాం కి ముఖ్య అతిధి గా హాజరయ్యాడు..ఈ ఎపిసోడ్ లో అలీ తో ఇప్పటి వరుకు అల్లు కుటుంబం గురించి మనకెవ్వరికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నాడు అల్లు అరవింద్.
ఈ సందర్భంగా అలీ మీకు మరియు చిరంజీవి గారి కుటుంబాలకు పడడం లేదని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి..మీరు ఎలా ఉంటారు అనేది మా అందరికి తెలుసు..కానీ జనాలకు కూడా తెలియాలని ఈ ప్రశ్న మిమల్ని అడుగుతున్నాను అంటూ అలీ మాట్లాడగా, అల్లు అరవింద్ దానికి సమాధానం చెప్తూ ‘చిరంజీవి గారి మరియు నేను దశాబ్దాల నుండి బెస్ట్ ఫ్రెండ్స్..ఇప్పటికి పండగ వస్తే మా కుటుంబం మొత్తం చిరంజీవి గారి ఇంటికి వెళ్లి సంబరాలు చేసుకుంటాము..మా ఇంట్లో జరిగే ఇలాంటి విశేషాలన్నీ వీడియో తీసి ప్రతిసారి చూపించలేం కదా’.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఒకే రంగం లో ఉంటున్నాం కాబట్టి..సినిమాలు చేస్తూ పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి..పోటీ తత్త్వం క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండడం సహజం..ఎవరి సినిమా వారికి గొప్ప..ఎవరి కష్టం వారిది..అక్కడ మాత్రమే వారి మధ్య పోటీ ఉంటుంది కానీ..చరణ్ – బన్నీ మధ్య ఉన్న సాన్నిహిత్యం ని చూసి నేను చిరంజీవి గారు ఆశ్చర్యపోతూ ఉంటాము..సొంత అన్నదమ్ములు లాగానే వాళ్ళు ఉన్నారు..ఎప్పటికి ఉంటారు కూడా’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.