Gabbar Singh: ఈ షాట్ లో కనిపిస్తున్నది పవన్ కళ్యాణ్ కాదా..? ఇన్ని రోజులు ఎవ్వరూ గమనించలేదుగా!

పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ మధ్య తెరకెక్కిన ఈ మాంటేజ్ సాంగ్ మధ్యలో ఒక చిన్న బిట్ పవన్ కళ్యాణ్ ఆరోజు షూటింగ్ లో అందుబాటులో లేకపోవడం వల్ల , డూప్ తో పని కానిచ్చేసారట. ఈ విషయాన్నీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు

Written By: Vicky, Updated On : మే 8, 2023 4:26 సా.
Follow us on

Gabbar Singh: సినిమాల్లో డూప్ ఉండడం సర్వసాధారణం.ప్రాణాలకు తెగించి చేసే రిస్కీ షాట్స్ లో హీరోలను కాకుండా, దూప్స్ ని పెడుతుంటారు దర్శక నిర్మాతలు. మేకింగ్ వీడియోలు చూస్తున్న సమయాల్లో వాళ్ళు చేసే స్తంట్స్ చూస్తే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చాలా గాయాలు కూడా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ డబ్బుల కోసం తప్పనిసరి పరిస్థితిలో చేస్తుంటారు కొంతమంది.

ఈ దూప్స్ కోసం హీరో పోలికలు చాలా దగ్గరగా ఉండేవాళ్ళని తీసుకొని చేస్తుంటారు. ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ లో అచ్చు గుద్దినట్టు హీరో పోలికలు వచ్చేలా ట్రిక్ ప్లే చేస్తారు. రిస్కీ స్తంట్స్ విషయం లోనే కాదు, కొన్ని సార్లు హీరోలు అందుబాటులో లేని సమయం లో కూడా దూప్స్ తో కొన్ని షాట్స్ ని తెరకెక్కిస్తూ ఉంటారు, అనాదిగా ఏళ్ళ తరబడి నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్న ట్రెండ్ ఇది. ప్రతీ హీరో విషయం లో జరిగేదే ఇది.

అలా పవన్ కళ్యాణ్ విషయం లో కూడా జరిగింది. ఆయన హీరో గా నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి సరికొత్త సెన్సేషన్ ని సృష్టించిన సినిమా ఇది, ఈ చిత్రం లోని పాటలు కూడా అప్పట్లో ఒక సెన్సేషన్, ఇప్పటికీ కూడా ఆ పాటలు బయట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ‘ఆకాశం అమ్మాయైతే’ అనే పాట పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ మధ్య తెరకెక్కిన ఈ మాంటేజ్ సాంగ్ మధ్యలో ఒక చిన్న బిట్ పవన్ కళ్యాణ్ ఆరోజు షూటింగ్ లో అందుబాటులో లేకపోవడం వల్ల , డూప్ తో పని కానిచ్చేసారట. ఈ విషయాన్నీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు, క్రింద కనిపిస్తున్న ఫొటోలో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదట, ఆయన డూప్ అట, ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఆ షాట్ ని అచ్చు గుద్దినట్టు పవన్ కళ్యాణ్ లాగ రీ క్రియేట్ చేశారట.ఈ విషయం తెలుసుకొని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.