Ramabanam Jagapathi Babu Role: ‘రామబాణం’ చిత్రం లో జగపతి బాబు పాత్రని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రాజశేఖర్ కి ప్రస్తుతం థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించేంత స్టార్ స్టేటస్ లేకపోయినా కూడా, స్క్రిప్ట్ ఎంపికల విషయం లో మాత్రం ఇప్పటికీ తన మార్కు ని చూపిస్తూనే ఉన్నాడు, ఆయన హీరో గా నటించిన గత చిత్రాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

Written By: Vicky, Updated On : May 8, 2023 4:48 pm
Follow us on

Ramabanam Jagapathi Babu Role: రీసెంట్ గా గోపీచంద్ మరియు శ్రీవాస్ కాంబినేషన్ లో విడుదలైన ‘రామబాణం’ అనే చిత్రం డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కనీస స్థాయి ఓపెనింగ్స్ కానీ, లాంగ్ రన్ ని కానీ రాబట్టలేకపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది.

ఇక నుండి షేర్స్ వచ్చే సూచనలు లేకపోవడం తో బయ్యర్స్ కి సాలిడ్ గా 12 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. రొటీన్ సబ్జెక్టు అవ్వడం, దానికి తోడు ఒక్క పాట కూడా వినసొంపుగా ఉండకపోగా, ఎంటర్టైన్మెంట్ కూడా అసలు ఏమాత్రం లేకపోవడం వల్ల ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఈ రేంజ్ లో రిజెక్ట్ చేసారని అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ కి అన్నయ్యగా జగపతి బాబు నటించిన సంగతి తెలిసిందే.చాలా కాలం తర్వాత ఆయన పూర్తి స్థాయి పాజిటివ్ రోల్ లో నటించాడు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్ ని అనుకున్నారట,కథ విన్నతర్వాత ఆయనకీ బాగా రొటీన్ అనిపించడం తో మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసాడట. అప్పట్లో గోపీచంద్ – రాజశేఖర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని టాక్ కూడా వచ్చింది,ఆ సినిమా మరేదో కాదు, ఈ రామబాణం సినిమానే.

రాజశేఖర్ కి ప్రస్తుతం థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించేంత స్టార్ స్టేటస్ లేకపోయినా కూడా, స్క్రిప్ట్ ఎంపికల విషయం లో మాత్రం ఇప్పటికీ తన మార్కు ని చూపిస్తూనే ఉన్నాడు, ఆయన హీరో గా నటించిన గత చిత్రాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అందులో భాగంగానే ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేసి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు రాజశేఖర్.