Bigg Boss 9 Telugu Voting: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్(Bigg Boss 9 Telugu) ఎంత ఉత్కంఠ నడుమ నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి మెయిన్ హౌస్, అవుట్ హౌస్ అని ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. మెయిన్ హౌస్ లో అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యులకు మొదటి వారం ఉండే అవకాశం కల్పించగా, అవుట్ హౌస్ లో మాత్రం టాప్ సెలబ్రిటీస్ ని ఉండమని బిగ్ బాస్ ఆదేశించాడు. వాళ్ళు ఓనర్స్, వీళ్ళు టెనెంట్స్. ఇలా విభజించిన తర్వాత జరిగిన సంఘటనలు ఎలాంటివో మొదటి ఎపిసోడ్ నుండి చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది. మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా చాలా ఫైర్ వాతావరణం లో జరిగింది. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ తనూజ,ఇమ్మానుయేల్, సంజన, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి, డిమోన్ పవన్, రీతూ చౌదరి, మహేష్ రాథోడ్, శ్రేష్టి వర్మ.
Also Read: కిష్కింధపురి vs మిరాయి: ఏ సినిమా హిట్? ఏది ఫ్లాప్?
వీరిలో ఇప్పుడు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అందులో రీతూ చౌదరి కూడా ఉంది అంటే నమ్ముతారా?, కానీ నమ్మాలి, ఆమె నిజంగానే డేంజర్ జోన్ లో ఉంది. టాప్ కంటెస్టెంట్ గా నిలుస్తుందని అనుకున్న రీతూ చౌదరి డేంజర్ జోన్ లో ఉండడం ఏంటి అని మీకు అనిపించొచ్చు. కానీ ఆమె బలమైన PR ని పెట్టుకొని రాలేదు. అందుకే ఈ వారం డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ వారానికి ఆమె కచ్చితంగా సేఫ్ అయిపోతుంది కానీ, ప్రస్తుతం ఉన్న గ్రాఫ్ ప్రకారం చూస్తే మరో రెండు సార్లు ఆమె నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తనూజ లాంటి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ ని ఈమె కార్నర్ చేయడం వల్ల కాస్త ఎఫెక్ట్ పడి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.
ఇక టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్న కంటెస్టెంట్స్ తనూజ, ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి మరియు సంజన. ఈ నలుగురిలో తనూజ కి టాప్ ఓటింగ్ పడుతుంది, మిగిలిన ముగ్గురుకి దాదాపుగా సమానమైన ఓటింగ్ నే వస్తుంది. ఇక వీళ్ళ తర్వాత డిమోన్ పవన్ కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్థానం లో రాము రాథోడ్ కొనసాగుతున్నాడు. ఎందుకో రాము రాథోడ్ కి పడాల్సిన రేంజ్ లో ఓటింగ్ పడడం లేదట. చూసేందుకు ఆ అబ్బాయి చాలా అమాయకం గా ఉన్నాడు,కల్మషం లేని మంచి మనసున్న వ్యక్తి లాగా అనిపిస్తున్నాడు, నిన్న కెప్టెన్సీ టాస్క్ కూడా అద్భుతంగా ఆడాడు. గెలించింది శ్రీజా నే అయినప్పటికి , అసలు సిసలు రియల్ విన్నర్ మాత్రం రాము రాథోడ్ అని అంటున్నారు. నేడు ఈ ఎపిసోడ్ టీవీ లో టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ తర్వాత రాము రాథోడ్ గ్రాఫ్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.