https://oktelugu.com/

మరోసారి మెరుపులు మెరిపించనున్న ఇస్మార్ట్ హీరోయిన్లు

పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మస్తుగా అలరించింది. మరీ ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకొంది. ఇక ఈ సినిమా విజయంలో హీరోయిన్ల పాత్ర మరువలేనిది ఇద్దరికి ఇద్దరు గ్లామర్ ఒలక పోయడంలో పోటీపడ్డారు. ఇపుడు మళ్ళీ అదే కాంబినేషన్ మరో సినిమాలో రాబోతుంది .కాకపొతే ఇక్కడ హీరో మారాడు . అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్ దొరక్క […]

Written By:
  • admin
  • , Updated On : March 23, 2020 / 05:15 PM IST
    Follow us on

    పూరీ జగన్నాధ్ దర్శకత్వం లో గత ఏడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మస్తుగా అలరించింది. మరీ ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకొంది. ఇక ఈ సినిమా విజయంలో హీరోయిన్ల పాత్ర మరువలేనిది ఇద్దరికి ఇద్దరు గ్లామర్ ఒలక పోయడంలో పోటీపడ్డారు. ఇపుడు మళ్ళీ అదే కాంబినేషన్ మరో సినిమాలో రాబోతుంది .కాకపొతే ఇక్కడ హీరో మారాడు .

    అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్ దొరక్క చాలా ఇబ్బంది పడ్డాడు చివరికి గత ఏడాది వచ్చిన ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా చేస్తున్నాడు .కాగా ‘కందిరీగ’లో ఉన్నట్టే ‘అల్లుడు అదుర్స్’ సినిమా లో కూడా ఇద్దరు కథానాయికలునటించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభ నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించనుంది. ఇక ఆ సాంగ్ సినిమాకే హైలెట్ కానుంది అంటోంది చిత్ర బృందం.

    ఇక ఈ సినిమా కూడా ‘కందిరీగ’ ఫార్మాట్ లోనే ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని తెలుస్తోంది. అలాగే ఆ చిత్రం లో ఒక కీ రోల్ పోషించిన సోనూ సూద్ ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఫైట్స్ అన్నీ హైఓల్టేజ్ లో రామ్, లక్ష్మణ్ నేతృత్వం లో రూపొందుతున్నాయి. మొత్తానికి ఈసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తోంది .
    A thing of beauty is joy forever