Isha Yadav : సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘రియా’ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే నోరెళ్లబెడుతారు!

ఓటీటీ ఆడియన్స్ నుండి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా కామెడీ సత్య, అజయ్ మధ్య జరిగే ఫన్నీ సంభాషణ సోషల్ మీడియా ని ఊపేస్తోంది. 'రియా ఎవరు..దామిని డాటర్..దామిని ఎవరు..రియా మదర్' అంటూ సాగే ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇంతకు ఈ రియా క్యారక్టర్ చేసిన అమ్మాయి ఎవరు?, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

Written By: Vicky, Updated On : October 21, 2024 9:18 pm

Isha Yadav

Follow us on

Isha Yadav : ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా, సత్య హీరోలుగా నటించిన ఈ సినిమాకి రితేష్ రానా దర్శకత్వం వహించాడు. హిలేరియస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే జరిగిన బిజినెస్ ని రెండింతల కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి అన్నమాట. ఈ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రితేష్ రానా దర్శకత్వంతో పాటు, కమెడియన్ సత్య టైమింగ్ కూడా ఒక కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు సత్య కామెడీ ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించేలా చేసింది. ఇప్పటికీ పలు థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా, రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది.

ఓటీటీ ఆడియన్స్ నుండి ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా కామెడీ సత్య, అజయ్ మధ్య జరిగే ఫన్నీ సంభాషణ సోషల్ మీడియా ని ఊపేస్తోంది. ‘రియా ఎవరు..దామిని డాటర్..దామిని ఎవరు..రియా మదర్’ అంటూ సాగే ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఇంతకు ఈ రియా క్యారక్టర్ చేసిన అమ్మాయి ఎవరు?, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ క్యారక్టర్ చేసిన అమ్మాయి పేరు ఇషా యాదవ్. ఈమె యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో పాపులర్ సెలబ్రిటీ. ఆమె అప్లోడ్ చేసే రీల్స్, ఫోటోలకు నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అలా సోషల్ మీడియా ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఈమె, రితేష్ రానా దృష్టిలో పడింది. వెంటనే ఆయన స్టూడియో కి పిలిచి ఆడిషన్ చేసి సినిమాలో తీసుకున్నాడు. ఈ అమ్మాయి కనిపించేది కాసేపే అయినా సినిమా కథని మొత్తం మలుపు తిప్పేసింది అని చెప్పొచ్చు.

కథ మొత్తం ఆ అమ్మాయి చుట్టూనే తిరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. థియేట్రికల్ రన్ నడుస్తున్నప్పుడు ఈ అమ్మాయికి అనుకున్న రేంజ్ గుర్తింపు రాలేదు కానీ, ఓటీటీ రిలీజ్ అప్పుడు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి సినిమాల్లో వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయట. రాబోయే రోజుల్లో ఈమె మంచి బిజీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది. ఇది ఇలా ఉండగా త్వరలోనే ‘మత్తు వదలరా 3’ కూడా వస్తుందని, ఈ ఫ్రాంచైజ్ కొనసాగుతూనే ఉంటుందని డైరెక్టర్ రితేష్ రానా తెలిపాడు.