
వెంకటేశ్ హీరోగా సురేశ్ బాబు నిర్మాతగా తీసిన చిత్రం ‘నారప్ప’ . ఈ తమిళ రిమేక్ మూవీని మొదట థియేటర్లలోనే విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాత సురేష్ బాబు యోచిస్తున్నారట.
అయితే థియేటర్లకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఓటీటీలో వెంకటేశ్ సినిమా విడుదల చేస్తుండడంపై థియేటర్ యాజమాన్యాలు, పంపిణీదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే కరోనా వల్ల థియేటర్లు తెరిచినా జనాలు వచ్చి చూసే పరిస్థితి లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే థియేటర్లు తిరిగి తెరవబడుతున్నాయి. జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. వెంకటేశ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా ఓటీటీకి అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారట.. అందుకే ఓటీటీలో రిలీజ్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
నిర్మాత సురేష్ బాబు తీసుకున్న నిర్ణయానికి ఓటీటీ లు కూడా సానుకూలంగా స్పందించాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ చిత్రానికి సహ నిర్మాత అయిన థాను మాత్రం ఓటీటీ రిలీజ్ కు ఒప్పుకోవడం లేదట.. చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేద్దామని పట్టుబడుతున్నాడట.. అయితే ఏదైనా నష్టం జరిగితే తన పారితోషికాన్ని తిరిగి ఇస్తానని చెప్పి థానూను ఒప్పించడానికి వెంకటేశ్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.