మనలో చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం ద్వారా ఎక్కువ మొత్తం లాభాలను పొందే అవకాశం ఉంటుందని భావిస్తుంటారు. వ్యాపారం చేయాలని అనుకునే వాళ్లకు పుట్టగొడుగుల పెంపకం మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతోనే పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించే అవకాశం ఉండగా పుట్టగొడుగులను సాగు చేసి విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.
కేవలం 5వేల రూపాయలతో ఈ బిజినెస్ ను మొదలుపెట్టే అవకాశం ఉండగా ఈ వ్యాపారం ద్వారా సులువుగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. డిమాండ్ ఆధారంగా ఈ బిజినెస్ ను విస్తరించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేకుండానే ఈ బిజినెస్ ను మొదలుపెట్టే అవకాశం ఉండగా ఈ పుట్టగొడుగులు నెల రోజుల్లో పెరుగుతాయి.
కంపోసైట్ ను వినియోగించడం ద్వారా పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు. నేల మీద పుట్టగొడుగులను పెంచడం సాధ్యం కాదు. కంపొసైట్ బ్యాగ్స్‌ను ముందుగానే కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుని ట్రైలలో వేసి పుట్టగొడుగుల విత్తనాలు చల్లి పుట్టగొడుగులను పెంచే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలు, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ల ద్వారా పుట్టగొడుగుల పెంపకానికి ట్రైనింగ్ తీసుకోవచ్చు.
ఎక్కువ మొత్తంలో పుట్టగొడుగులను పెంచాలని అనుకునే వాళ్లు శిక్షణ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఒక చదరపు మీటరు విస్తీర్ణంలో 10 కేజీల పుట్టగొడుగులను పెంచే అవకాశం ఉంటుంది.