https://oktelugu.com/

షర్మిల, రేవంత్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈల వేసినా.. గోల చేసినా.. ఆఖరికి సైలెంట్ గా ఉన్నా వార్తే.. అలాంటిది కామెంట్ చేస్తే పెద్ద వార్త అవుతుంది. తాజాగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ మార్పులు, సమీకరణాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావడం.. షర్మిల పార్టీ పెట్టడంపై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. తండ్రి వైఎస్ఆర్ జయంతి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2021 / 01:42 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈల వేసినా.. గోల చేసినా.. ఆఖరికి సైలెంట్ గా ఉన్నా వార్తే.. అలాంటిది కామెంట్ చేస్తే పెద్ద వార్త అవుతుంది. తాజాగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ మార్పులు, సమీకరణాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావడం.. షర్మిల పార్టీ పెట్టడంపై పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.

    ఈరోజు తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. తండ్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిల ఈసాయంత్రం పార్టీని, జెండాను, విధివిధానాలు ప్రకటించబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే షర్మిల పార్టీపై అటు ఏపీ, ఇటు తెలంగాణలో పలువురు ప్రముఖ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలపై పెద్దగా స్పందించని జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్ని పార్టీలతోనైనా రావచ్చని.. అందులో అభ్యంతరం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అయితే రాజకీయ వారసత్వం తనకు చేతకాదని ఒప్పుకున్న పవన్.. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

    తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వద్ద డబ్బు, బలం లేదని పవన్ నిజాన్ని ఒప్పుకున్నారు. పగటి కలలు కనే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు.

    ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన విషయాన్ని కూడా తాను విన్నానని పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.