Pawan Kalyan- Trivikram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇద్దరి కలయికలో ‘జల్సా, అత్తారింటికి దారేది’ లాంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడ పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ మంచి ఆప్తులు. పవన్ సినిమాల సెలక్షన్ విషయంలో త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటూనే ఉంటుంది.

అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ పై ప్రయోగాలు చేయడానికి త్రివిక్రమ్ వెనుకాడుతున్నాడు. ‘అజ్ఞాతవాసి’ లాంటి సొంత కథ భారీగా డిజాస్టర్ కావడంతో ఇక మళ్లీ పవన్ తో సొంత కథలపై ప్రయోగం చేయడానికి త్రివిక్రమ్ వెనుకంజ వేస్తున్నారు.
పైగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూ చాలా బిజీగా ఉంటున్నారు. ఖాళీ టైంలో సినిమాలు చేస్తున్నాడు. పవన్ ఏపీలో రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు. అందుకే పవన్ తో సొంత కథతో ఎక్కువ రోజులు చిత్రీకరించే బదులు.. హిట్టైన రిమేక్ సినిమాలు చేయడం బెటర్ అని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. మలయాళం, తమిళంలో హిట్ అయిన చిత్రాలను తీసుకొని అందులోని హీరో వెర్షన్ ను తీస్తే సరిపోతుందని ఇలా చేస్తున్నాడు.

అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కువగా రిమేక్ సినిమాలే చేస్తున్నాడు. అవి ఆల్ రెడీ హిట్ కావడంతో కథపై నమ్మకం.. టైం లేక త్వరగా పూర్తి చేయడానికి వీలవుతుంది. అయితే వేరే హీరోలతో సొంత కథలు చేస్తూ.. పవన్ కళ్యాణ్ కుమాత్రం రిమేక్ కథలు చేయడంపై ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. పవన్ కు త్రివిక్రమ్ రిమేక్ లతో అన్యాయం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. పవన్ ను రిమేక్ హీరోగా త్రివిక్రమ్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.