Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు త్రివిక్రమ్… ఈయన చేసిన చాలా సినిమాలు మంచి సక్సెస్ లను అందుకుంటూ ఉంటాయి. ఇక ఈయన సినిమాల్లో డైలాగులు మాత్రం ప్రతి ప్రేక్షకుడికి చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంటాయి.
మాటలతో మ్యాజిక్ చేయగల రచయిత, దర్శకుడు కావడం వల్లే ఆయన్ని మాటలు మాంత్రికుడు అని కూడా పిలుస్తుంటారు. నిజానికి త్రివిక్రమ్ ఒక సినిమాకు మాటలు రాశాడు అంటే అందులో చాలా డెప్త్ ఉంటుందని ఇప్పటివరకు చాలా సినిమాలు రుజువు చేశాయి. ఆయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు డైలాగుల వల్లే సక్సెస్ అయ్యాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన పెన్ను బలం ఎంత గొప్పదో…
ఇక ఇలాంటి త్రివిక్రమ్ చాలా రోజుల నుంచి ఒక విమర్శనైతే ఎదుర్కొంటున్నాడు. అది ఏంటంటే ఆయన సినిమాల్లో ఎక్కువగా వాళ్ల క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళని ఇన్ క్లూడ్ చేసుకుంటూ ఉంటాడని ఇప్పటికే చాలామంది విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఆయన బ్రాహ్మణ కులానికి చెందిన వాడు కాబట్టి వాళ్ల క్యాస్ట్ వాళ్ళనే ఎక్కువ గా తీసుకుంటారు అనే విషయం అయితే ఇండస్ట్రీ లో చాలా రోజుల నుంచి వినిపిస్తుంది.
ఇక ఈయన సినిమాల్లో తనికెళ్ళ భరణి, అలాగే రాజబాబు తమ్ముడు అయిన అనంత్, గుండు సుదర్శన్ లాంటి నటులు ఎక్కువగా కనిపిస్తారు. అలాగే ఇక వీళ్ళతో పాటుగా సీతారామశాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి లాంటి లిరిక్ రైటర్ల చేత పాటలు రాయచ్చుకుంటూ ఉంటాడు. ఇలా ఈయన సినిమాల్లో చాలావరకు నటీనటులను గాని, టెక్నీషియన్లను గాని వాళ్ల క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళనే తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని చాలామంది ఆయన్ని విమర్శిస్తూ వస్తున్నారు.
ఇక పూజ హెగ్డే వాళ్ల క్యాస్ట్ కు సంబంధించిన హీరోయిన్ కావడం వల్లే తనని కూడా దాదాపు రెండు సినిమాల్లో తీసుకున్నాడు. ఇక మీదట కూడా ఆమెతో ఇంకా కొన్ని సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది.
ఇక కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తుంటే, మరి కొంత మంది మాత్రం వాళ్ళందరు త్రివిక్రమ్ కి మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల వాళ్ళని సినిమాల్లో తీసుకుంటున్నారు తప్ప క్యాస్ట్ ఫీలింగ్ ఏముండదని చెబుతున్నారు. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ వాళ్ళని ఏ ఉద్దేశ్యం తో తీసుకున్నాడో తెలియదు గాని ఆయన సినిమాల్లో మాత్రం ఎక్కువగా వాళ్లే రిపీట్ అవుతూ ఉంటారు…