https://oktelugu.com/

Prabhas and Kajal: ప్రభాస్, కాజల్ పెళ్లి ఎవరి వల్ల ఆగిపోయిందో తెలుసా..?

Prabhas and Kajal: మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా కోసం కాజల్ ను తీసుకొమని దశరధ్ కి ప్రభాస్ రికమండ్ చేసినట్టుగా కూడా చాలా వార్తలు అయితే వచ్చాయి. మొత్తానికి అయితే ప్రభాస్ కాజల్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు చాలా సంవత్సరాల పాటు వైరల్ గా మారాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 19, 2024 / 12:57 PM IST
    Follow us on

    Prabhas and Kajal: ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ తర్వాత తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఆయన చేసిన వర్షం, ఛత్రపతి, బుజ్జిగాడు లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక డార్లింగ్ సినిమా సమయంలో ఆయనకి కాజల్ తో పరిచయం ఏర్పడింది. అలాగే మంచి ఫ్రెండ్స్ గా కూడా మారారు.

    దాంతో స్క్రీన్ మీదా వీళ్ళిద్దరికీ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉండడంతో ఆన్ స్క్రీన్ బెస్ట్ జోడి గా ఇద్దరు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నిజ జీవితంలో కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనే వార్తలు కూడా అప్పట్లో చాలా వచ్చాయి. అయితే నిజంగానే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా అనేది తెలియదు గానీ, అప్పట్లో వీళ్ళ మీద రూమర్స్ అయితే చాలా వచ్చాయి. ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేకపోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి.

    ఇక అలాగే మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా కోసం కాజల్ ను తీసుకొమని దశరధ్ కి ప్రభాస్ రికమండ్ చేసినట్టుగా కూడా చాలా వార్తలు అయితే వచ్చాయి. మొత్తానికి అయితే ప్రభాస్ కాజల్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు చాలా సంవత్సరాల పాటు వైరల్ గా మారాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకపోవడంతో ఆ న్యూస్ కి తెరపడింది. నిజానికి వీళ్ళిద్దరూ అప్పట్లో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేశారంట, కానీ ప్రభాస్ వాళ్ల పెదనాన్న అయిన కృష్ణంరాజు ఎంటర్ అవడంతో వీళ్ళ ప్రేమ కి పులిస్టాప్ పడింది అంటూ మరి కొంతమంది చెబుతుంటారు. ఇక మొత్తానికైతే వాళ్లు ప్రేమించుకున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రభాస్ పక్కన బెస్ట్ హీరోయిన్ గాపేరు తెచ్చుకున్న వాళ్ళలో కాజల్ ముందు స్థానం లో ఉంటుంది.

    ఇక ఆమె ఇప్పటికే పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనింది. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికి కూడా పెళ్లి లేకుండా ఇప్పుడు బ్యాచ్ లర్ వానే ఉన్నాడు. ఇక ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది… తన తొటి వాళ్ళందరూ పెళ్లి చేసుకోవడం తను మాత్రమే ఒంటరిగా మిగిలి ఉండడం చూస్తున్న ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అనే విషయం మీద చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు…