China Population: జన చైనాలో జనాభా తగ్గుతోంది.. కారణం ఏంటి?

China Population: 2020, 21, 22, 23 ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు కోవిడ్ విశ్వరూపం చూపించడంతో చైనా కోలుకోలేకపోయింది. బయటికి చెప్పలేకపోయినప్పటికీ గత ఏడాది చైనా దేశవ్యాప్తంగా 1.11 కోట్ల మరణాలు నమోదయ్యాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : January 19, 2024 12:45 pm
Follow us on

China Population: ఒకరు ముద్దు లేకుంటే అసలు వద్దు.. ఇదీ చైనాలో మొన్నటి వరకు అమలులో ఉన్న నిబంధన. కమ్యూనిస్టు ప్రభుత్వం కావడంతో అక్కడ ఆ నిబంధనను అత్యంత కఠినంగా అమలు చేశారు. దీంతో చైనా జనాభా తగ్గడం ప్రారంభమైంది.. దీనికి కోవిడ్ కూడా తోడు కావడంతో చైనా దేశంలో జనాభా పెరుగుదల మరింత తగ్గిపోయింది. చైనాలో తగ్గుదల నమోదు కావడం.. భారత్లో పెరుగుదల నమోదు కావడంతో.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరు గడించింది. జనాభా తగుతను నేపథ్యంలో చైనా ఇప్పుడు ఆందోళన చెందుతోంది. ఎందుకంటే చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక అక్కడి ప్రజల కృషి ఎంతో ఉంది. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రధాన కారణం అక్కడి తయారీ రంగం. చైనాలో విలువైన మానవ వనరులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అక్కడ తయారీ రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. దీంతో పెద్దపెద్ద కంపెనీలు, ఇతర దేశాలు చైనా తయారు చేసే ఉత్పత్తుల మీద ఆధారపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చైనా తయారీ రంగాన్ని కోవిడ్ ఒకసారి గా మార్చేసింది.. కోవిడ్ మహమ్మారి వరుసగా నాలుగు సంవత్సరాలు ఆ దేశం పై విజృంభించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

2020, 21, 22, 23 ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు కోవిడ్ విశ్వరూపం చూపించడంతో చైనా కోలుకోలేకపోయింది. బయటికి చెప్పలేకపోయినప్పటికీ గత ఏడాది చైనా దేశవ్యాప్తంగా 1.11 కోట్ల మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలు కోవిడ్ వల్లే సింహభాగం చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. ఈ మరణాలను చైనా కొంతకాలం వరకు దాచి పెట్టింది. జనాభా లెక్కల విషయం వచ్చేసరికి గత ఏడాది కోవిడ్ మరణాలను చైనా దాచిపెట్టిందని తేటతెల్లమవుతోంది. గత ఏడాది చైనా జనాభా 20.8 లక్షలు తగ్గింది. ప్రస్తుతం 140.97 కోట్లుగా నమోదయింది. 2022లో 95.6 లక్షల జననాలు చైనాలో నమోదయ్యాయి.. 2023 నాటికి జననాల సంఖ్య 90.2 లక్షలకు తగ్గింది.

చైనా ప్రభుత్వం జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ఒకరు ముద్దు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల చాలామంది పిల్లలు కనడానికి వెనుకంజ వేశారు. దీనికి తోడు చాలామంది యువత అక్కడ పెళ్లిళ్లు చేసుకోకపోవడం.. పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ పిల్లలను కనడానికి ఇష్టపడకపోవడం.. చదువు, ఉద్యోగం, కెరియర్ వంటి విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో అక్కడ పెళ్లిళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇది ఇలా ఉంటే కోవిడ్ నాలుగు సంవత్సరాల పాటు అక్కడ విజృంభించడంతో జనాభా సంఖ్య దారుణంగా పడిపోయింది.. ప్రస్తుతం రెండవ స్థానానికి పడిపోయిన చైనా.. కొంతకాలం తర్వాత యువశక్తిని కోల్పోయి వృద్ధ చైనాగా మారుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆ పరిస్థితి రాకముందే మేలుకోవాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే యువత వీలైనంతమంది ఎక్కువ పిల్లల్ని కనాలని చెబుతోంది. ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటిస్తోంది. అయినప్పటికీ అక్కడ యువత నుంచి ఆశించినంత స్పందన రావడం లేదు. ఇదే సమయంలో భారత్ జనాభా విషయంలో మొదటి స్థానంలో ఉంది. యువశక్తి విషయంలోనూ చైనా దేశాన్ని దాటిపోయింది. ఇక తయారీ రంగంలోనూ పోటీ ఇస్తే భారతదేశానికి తిరిగి ఉండదని నివేదికలు చెబుతున్నాయి.