Samantha Ruth Prabhu : సమంత హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది. తన తోటి నటులు పలువురు ఈ విషయం ఓపెన్ గా చెప్పారు. మొన్నటి వరకు సిటాడెల్ షూటింగ్ లో సమంత చెమటోడ్చింది. యాక్షన్ సిరీస్ కావడంతో కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఈ క్రమంలో తనకు తగిలిన గాయాలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆరు నెలలు కష్టపడిన సమంత సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ షూటింగ్స్ పూర్తి చేశారు. ఖాళీగా ఉన్న సమంత విదేశాలకు వెళ్లారు.
సేదతీరేందుకు ఇండోనేషియా దేశాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలి ద్వీపంలో మకాం వేశారు. విరామ సమయంలో సమంత ఆహ్లాదంగా గడుపుతుంది. అక్కడి తన ఎంజాయ్మెంట్ ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. తాజాగా సమంత పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. డెనిమ్ షార్ట్స్ లో అమ్మడు సెగలు పుట్టించింది. సమంత క్రేజీ డాన్స్ వీడియో చూసిన నెటిజెన్స్ సమంత విదేశాల్లో చేస్తుంది ఇదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్నేహితులతో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నారు. అనంతరం సమంత అమెరికా వెళతారనే ప్రచారం జరుగుతుంది. సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసిందే. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోనున్నారట. అమెరికాలో కొన్ని నెలలు ఉంటారనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఏడాది పాటు సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
ఇక సమంత కెరీర్ పరిశీలిస్తే… ఆమె లేటెస్ట్ రిలీజ్ శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. సమంత ఎన్నడూ చూడని అపజయం ఎదుర్కొంది. దీంతో ఖుషి మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ ఖుషి తెరకెక్కించారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
https://www.instagram.com/p/CvOsUt_gwnS/