Ram Charan and Sukumar movie title: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. వచ్చే నెల చివరి వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. రీసెంట్ గానే డైరెక్టర్ బుచ్చి బాబు ఫస్ట్ హాఫ్ ని ఎడిటింగ్ తో సహా లాక్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కి రీ రికార్డింగ్ కోసం పంపేశాడు. సెకండ్ హాఫ్ కూడా ఒక కీలక సన్నివేశం తప్ప, షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఆ కీలక సన్నివేశాన్నే చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. మార్చి 27న విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ, ఆ తేదికి ఈ చిత్రం రావడం కష్టమే అని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మే1, లేదా దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.
ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్(Sukumar) మూవీ కి షిఫ్ట్ అవుతాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘రంగస్థలం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత, వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది. రంగస్థలం చిత్రం అప్పట్లో కమర్షియల్ గా మాత్రమే కాకుండా, రామ్ చరణ్ కి నటుడిగా ఒక రేంజ్ లో వర్కౌట్ అయిన చిత్రం అని చెప్పొచ్చు. ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో పెర్ఫార్మన్స్ పరంగా చూస్తే రంగస్థలం లోని రామ్ చరణ్ నటన ఒక సరికొత్త బెంచ్ మార్క్. ఏ స్టార్ హీరో అయినా బాగా నటిస్తే, ‘రంగస్థలం’ లో రామ్ చరణ్ రేంజ్ లో నటించారా లేదా అనేది చూస్తున్నారు. ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని సెట్ చేసిన కాంబినేషన్ ఇది. మళ్లీ అలాంటి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటే కచ్చితంగా అంచనాలు వేరే రేంజ్ లో ఉంటాయి.
ఆ అంచనాలను ఎంత మేరకు అందుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇకపోతే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఈసారి ‘రంగస్థలం’ తరహా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండదు అని స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ తో రాబోతున్నారట. ఈ చిత్రానికి ‘బ్లాక్ హార్స్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. జేమ్స్ బాండ్ తరహా భారీ యాక్షన్ చిత్రం కాబట్టి, ఈ టైటిల్ ని పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. కానీ ఇంగ్లీష్ టైటిల్స్ మన టాలీవుడ్ లో అంతగా వర్కౌట్ అవ్వవు. ఇప్పటి వరకు జరిగింది అదే. మరి ఈ సినిమాకు ఈ టైటిల్ ని ఆడియన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.