Dhurandhar Collection Day 50: డిసెంబర్ 4 న విడుదలైన ‘ధురంధర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా మిగలబోతుందని, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయని, నిర్మాతలకు ఈ సినిమా పెద్ద నష్టాలను మిగిలించబోతుందని, ఇలా ఈ సినిమా అంటే గిట్టని వాళ్ళు ఎన్నో కామెంట్స్ చేశారు. కానీ రెండవ రోజు నుండి ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను చూసి ప్రతీ ఒక్కరు ముక్కున వేలు వేసుకున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ సినిమా వసూళ్లను చూసి ఎన్నో దశాబ్దాల నుండి సినీ పరిశ్రమ కలెక్షన్స్ ని గమనిస్తున్న ట్రేడ్ విశ్లేషకులకు సైతం మతి పోయినంత పని అయ్యింది. అలాంటి బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం 50 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరం గా చూద్దాం.
బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 7వ వారంలో 16.25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇదంతా ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలు మాత్రమే. మొదటి వారం 218 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, రెండవ వారం లో ఏకంగా 261 కోట్లు, మూడవ వారం లో 190 కోట్లు, నాల్గవ వారం లో 115 కోట్లు, ఐదవ వారంలో 57 కోట్లు, ఆరవ వారం లో 29 కోట్లు, 7 వ వారం లో 16.25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 886 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక 900 కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు ఈ చిత్రానికి గ్రాస్ లెక్కలు అంచనా వేస్తే 1330 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. సీక్వెల్ క్రేజ్ లేకుండా, పాన్ ఇండియా రిలీజ్ లేకుండా , ఒక హిందీ చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం అనేది ఈ చిత్రానికి మాత్రమే జరిగింది. ఇంతటి సునామీ సృష్టించిన ఈ చిత్రం ఈ నెల 30 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో ఈ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా , ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.