https://oktelugu.com/

Megastar Chiranjeevi: లోకేష్ విషయంలో ఓపెన్ అయిన మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) గుంభనంగా ఉంటారు. కానీ ఈరోజు మంత్రి నారా లోకేష్ విషయంలో ఓపెన్ అయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 23, 2025 / 01:12 PM IST
    Chiranjeevi

    Chiranjeevi

    Follow us on

    Megastar Chiranjeevi: మంత్రి నారా లోకేష్( nara Lokesh ) జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. జన్మదిన కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెడుతున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ తరుణంలో ఆయనకు ప్రముఖుల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి లోకేష్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ పై కామెంట్స్ వస్తున్నాయి. అటుపై వైరల్ కూడా అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేనకు మద్దతు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి రావడం పై సంతృప్తి కూడా వ్యక్తం చేశారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సైతం హాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.

    * రాజకీయ వివాదం నేపథ్యంలో
    గత కొద్దిరోజులుగా ఏపీలో( Andhra Pradesh) రాజకీయ వివాదం నెలకొంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టిడిపి నేతలు కోరుతూ వచ్చారు. దీనిపై జనసేన సైతం ఒక రకమైన రియాక్షన్ ఇచ్చింది. రెండు పార్టీల మధ్య ఒక విధమైన యుద్ధ వాతావరణం నడిచింది. దీనికి రెండు పార్టీలు ఫుల్ స్టాప్ పెట్టాయి. బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు ఇరు పార్టీల నాయకత్వాలు సూచించాయి. దీంతో సాధారణ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా లోకేష్ కు ప్రత్యేకంగా చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం.. అందులో పేర్కొన్న అంశాలు చూస్తే కూటమి ప్రభుత్వం పట్ల తనకు ఉన్న సానుకూలత.. భవిష్యత్తులో తన ఆకాంక్ష బయట పెట్టినట్లు అయింది.

    * పోస్ట్ వైరల్ చిరంజీవి( Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా లోకేష్ కు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగు ప్రజలకు సేవ చేయాలని నిర్విరామ కృషి, అభిరుచి హర్షనీయం అన్నారు. ఏపీని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తుండడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ సాగిస్తున్న అన్ని ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అయితే చిరంజీవి ట్విట్ పై అప్పుడే రకరకాల చర్చ ప్రారంభం అయింది. త్వరలో చిరంజీవి జాతీయస్థాయిలో ఓ పదవి అందుకోబోతున్నారని.. అందుకు అనుకూల వాతావరణం క్రియేట్ చేయడానికి నారా లోకేష్ జన్మదిన నాడు కీలక వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టారని ప్రచారం జరుగుతోంది.

    * కేంద్రంలో పెద్ద పదవి
    చిరంజీవి విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రధాని మోదీ( Prime Minister Modi) ఎప్పుడు ఆసక్తి కనబరుస్తుంటారు. చిరంజీవికి ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు. త్వరలో చిరంజీవి బిజెపిలో చేరుతారని కూడా అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఏ పార్టీతో సంబంధం లేకుండా పెద్దమనిషి తరహాలో వ్యవహరిస్తానని చిరంజీవి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే జాతీయస్థాయిలో ఓ కీలక పోస్టులో చిరంజీవిని నియమిస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కీలక భాగస్వామి. పవన్ మద్దతు ఎప్పుడు చిరంజీవికి ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా ఉంటారు. ఈ విషయంలో ఇద్దరు నేతలు చిరంజీవికి మద్దతుగా నిలుస్తారని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నారా లోకేష్ జన్మదినం నాడు.. గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదో ప్రాధాన్య అంశంగా మారింది.