https://oktelugu.com/

Animal movie : అనిమల్ సినిమా మీద ఇప్పటికి నెగెటివ్ కామెంట్లు చేస్తున్న బాలీవుడ్ మాఫీయా…కారణం ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతున్న సందర్భంగా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 9, 2024 / 08:30 AM IST

    Animal movie

    Follow us on

    Animal movie : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతున్న సందర్భంగా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ సక్సెస్ ని సాధించడానికి స్టార్ డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారు…

    సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘అనిమల్ ‘ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. అయినప్పటికి ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని ఎవరు మర్చిపోవడం లేదు. నిజానికి అనిమల్ లాంటి సినిమా ప్రేక్షకుల యొక్క అభిరుచికి భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ అందులో హీరో అయిన రణ్బీర్ కపూర్ ని సందీప్ రెడ్డివంగా చూపించిన విధానం అలాగే సినిమా కథ ప్రతి ఒకటి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. కానీ ఈ సినిమా మీద బాలీవుడ్ మాఫియా మాత్రం కొంతవరకు నెగెటివ్ ప్రచారం అయితే చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా వచ్చి సక్సెస్ అయిన సంవత్సరానికి కూడా ఈ సినిమాని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అనిమల్ సినిమాకి సీక్వెల్ గా ‘అనిమల్ పార్క్’ అనే సినిమాను కూడా తీసుకురాబోతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో బాలీవుడ్ మాఫియా మరోసారి అనిమల్ సినిమా గురించి మాట్లాడుతూ అనిమల్ సినిమా అసలు సినిమానే కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కారణం ఏదైనా కూడా రన్బీర్ కపూర్ లాంటి హీరోకి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించిన సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ తో మరొక సినిమా చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటానని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి హీరో డైరెక్టర్ల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ వల్లే ఈ సినిమా అనేది చాలా బాగా వచ్చిందని కూడా తెలియజేయడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు నుంచి వచ్చే సినిమాల్లో కొంచెం బోల్ట్ కంటెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది.

    మరి అలాంటి సినిమాలను కూడా ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఆయన సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలకంటే కంప్లీట్ చేంజ్ ఓవర్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ప్రభాస్ లాంటి స్టార్ హీరోని డీల్ చేయాలంటే కొంచెం బోల్డ్ కంటెంట్ కంటే కూడా మిగతా విషయాల మీద ఎక్కువగా కాన్సెంట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.

    అందువల్ల ఈ సినిమా కోసం ఆయన ప్రభాస్ ను చాలా వైల్డ్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో బాహుబలి రికార్డును కూడా తిరగరాస్తానని సందీప్ రెడ్డి వంగ చెప్పిన మాటలు ప్రభాస్ అభిమానులను ఆనందపడేలా చేస్తున్నాయి… అయితే ఒక తెలుగువాడైన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ కొట్టడాన్ని అక్కడి మాఫియా జీర్ణించుకోలేకపోతోంది…