UPI Payments : భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రపంచ స్థాయిలో కొత్త గుర్తింపును సృష్టించింది. శనివారం విడుదల చేసిన పరిశోధన నివేదిక ప్రకారం.. 2016లో ప్రారంభించబడిన యూపీఐ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను, డిజిటల్ లావాదేవీలను పూర్తిగా మార్చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్ 30 కోట్ల మంది వ్యక్తులు, 5 కోట్ల మంది వ్యాపారులకు గ్యాప్ లేని డిజిటల్ లావాదేవీల అనుభవాన్ని అందించింది. అక్టోబర్ 2023 నాటికి భారతదేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపులలో యూపీఐ 75శాతం వాటాను కలిగి ఉంటుందని అంచనా వేసింది. ఇది దాని అసమానమైన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది.
గ్రామాల్లోనూ పెరుగుతున్న ఆదరణ
ఐఐఎం, ఐఎస్ బీ ప్రొఫెసర్లు రూపొందించిన ఈ పరిశోధన నివేదిక ప్రకారం, యూపీఐ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఒకే విధంగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. పరిశోధన ప్రకారం, యూపీఐని విస్తృతంగా స్వీకరించడంలో చౌకగా లభిస్తున్న ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీ పెరుగుదలో ముఖ్యమైన పాత్ర పోషించింది. యూపీఐ ఆర్థిక లావాదేవీలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, అణగారిన వర్గాలకు అధికారిక రుణాలకు మార్గం తెరుస్తోందని ఈ నివేదిక పేర్కొంది. యూపీఐ సబ్‌ప్రైమ్ క్రెడిట్ రుణగ్రహీతలు అధికారిక రుణాలను పొందడంలో సహాయపడింది. ఫిన్‌టెక్ కంపెనీలు యూపీఐ సహాయంతో 2015 – 2019 మధ్య, చిన్న, వెనుకబడిన రుణగ్రహీతలకు ఇచ్చిన రుణాల మొత్తాన్ని 77 రెట్లు పెంచాయి. యూపీఐ లావాదేవీలలో 10శాతం పెరుగుదలతో పాటు రుణ లభ్యతలో 7శాతం పెరుగుదల నమోదైంది. డిజిటల్ ఫైనాన్షియల్ హిస్టరీ రుణదాతలు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడిందని ఇది స్పష్టం చేస్తుంది.
యూపీఐ ఎందుకు విజయవంతమవుతోంది?
యూపీఐ విజయానికి మరో ప్రధాన కారణం ఏమిటంటే, రుణాలు పెరిగినప్పటికీ, డిఫాల్ట్ రేట్లలో పెరుగుదల లేదు. డిజిటల్ లావాదేవీల ద్వారా పొందిన డేటా రుణదాతలు బాధ్యతాయుతంగా విస్తరించడంలో సహాయపడుతుంది. పరిశోధన ప్రకారం, అధిక యూపీఐ వినియోగం ఉన్న ప్రాంతాల్లో సబ్‌ప్రైమ్, కొత్తగా క్రెడిట్ రుణగ్రహీతలకు ఇచ్చే రుణాలు వరుసగా 8శాతం మరియు 4శాతం పెరిగాయి.
యూపీఐ మోడల్‌ను అవలంబిస్తోన్న ప్రభుత్వం
భారతదేశం యూపీఐ మోడల్ ఇతర దేశాలకు రోల్ మోడల్‌గా ఉండగలదని కూడా ఈ నివేదిక సూచిస్తుంది. భారత ప్రభుత్వం అందించిన యూపీఐ ప్రయోజనాలు దేశానికి మాత్రమే పరిమితం కాకూడదు, కానీ దానిని ప్రపంచవ్యాప్తంగా స్వీకరించాలి. యూపీఐ ఈ విప్లవం భారతదేశంలో ఆర్థిక చేరికను ప్రోత్సహించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన ఫిన్‌టెక్ పరిష్కారంగా కూడా నిలబడింది. ఈ మోడల్‌ను అనుసరించడం ద్వారా ఇతర దేశాలు డిజిటల్ లావాదేవీలను, ఆర్థిక చేరిక(financial inclusion)లను ఏ మేరకు మార్చగలుగుతున్నాయో ఇప్పుడు