Ghaati vs Kotha Lokah: ఆ సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు అయితే వచ్చాయి. ప్రేక్షకుడికి నచ్చిన సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక ముఖ్యంగా పెరిగిన టికెట్ల రేట్ల కారణంగా ఆడియన్స్ చాలా క్యాలిక్యులేటెడ్ గా సినిమా లని చూస్తున్నారు. సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ సినిమాను చూడ్డానికి ఇష్టపడుతున్నారు. ఇక అందులో భాగంగానే క్రిష్ డైరెక్షన్లో అనుష్క మెయిన్ లీడ్ లో వచ్చిన ‘ఘాటీ’ సినిమా గతవారం రిలీజ్ అయింది. మరి ఈ సినిమా మొదటి షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. కానీ మలయాళం నుంచి వచ్చిన కొత్తలోక చాప్టర్ 1 అనే సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఈ సినిమాలో ఉన్నది ఏంటి ఘాటి సినిమాలో మిస్సయింది ఏంటి అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఘాటీ సినిమాని రివేంజ్ స్టోరీగా మలిచారు. ఇప్పటికే ఇండస్ట్రీలో రివెంజ్డ్ కథలతో సినిమాలు వచ్చాయి. ఇక దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో కూడా క్రిష్ చాలా వరకు తడబడ్డాడు. దానివల్లే ఈ సినిమా ప్రేక్షకుడికి నచ్చలేదు. ఇక ఎమోషన్ అయితే అస్సలు పండలేదనే చెప్పాలి. ఇక దాంతో సినిమా నుంచి డివియెట్ అయిపోయిన ఆడియన్ సినిమా ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాడే తప్ప సినిమా మాత్రం చూడలేకపోయాడు…
ఇక కొత్తలోకి చాప్టర్ 1 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇక ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వచ్చాయి. కాబట్టి ఈ సినిమాకి చాలా మంచి క్రేజ్ అయితే దక్కింది. దాంతో పాటు గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంతో ఈ సినిమాకి థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది.
తద్వారా ఈ సినిమా ప్రేక్షకుడిలో చూడడానికి ఇష్టపడుతూ ముందుకు సాగుతున్నారు… ఈ మూవీలో ప్రతి సీను కూడా ప్రేక్షకుడిని హత్తుకునే విధంగా ఉంది. అలాగే ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసేలా ఉన్నాయనే చెప్పాలి…
ఈ విషయాల వల్లే ‘ఘాటి’ సినిమా ప్రేక్షకుడికి నచ్చకపోవడం, ‘కొత్తలోక చాప్టర్ 1’ సినిమా ప్రేక్షకులకు నచ్చడం జరిగింది. అందుకే సినిమా చేసేటప్పుడే సినిమాలు ఎమోషన్ ప్రాపర్ గా ఎలివేట్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటే బాగుంటుందని సగటు ప్రేక్షకులు సైతం వల్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు విశేషం…