https://oktelugu.com/

Bigg Boss Telugu 8  : స్టార్ హీరో మూవీలో అవకాశం..భారీ రెమ్యూనరేషన్..కానీ ‘బిగ్ బాస్ 8’ కోసం వదిలేసుకున్న నయనీ పావని బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు!

ఆడియన్స్ రిక్వెస్ట్ ని బలంగా గమనించిన బిగ్ బాస్ టీం ఎట్టకేలకు ఆమెని ఈ సీజన్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాడు. అయితే నయనీ పావని కి హౌస్ లో ఉన్న ఆ వారం రోజులు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. ఆమె బయటకి రాగానే బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 7, 2024 / 08:33 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8  : గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టిన నయనీ పావని గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఆడియన్స్ కి అనిపించింది. కానీ ఈమె అంతకు ముందు ఏ టీవీ సీరియల్ కానీ, ఎంటర్టైన్మెంట్ షో ద్వారా కానీ ఆడియన్స్ కి పరిచయం కాలేదు. దాని వల్ల ఈమెకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే అప్పట్లో తక్కువ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఎలిమినేట్ అయ్యింది, హౌస్ లోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈమె కంటెస్టెంట్స్ అందరితో బలమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. టాస్కులు కూడా బాగానే ఆడింది, కంటెంట్ కూడా కావాల్సినంత ఇచ్చింది, ఇన్ని చేసినా కూడా ఎలిమినేట్ అవ్వడం తో వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసింది.

    ఆమెతో పాటు హౌస్ మేట్స్ లో ఉన్న వాళ్ళందరూ ఏడ్చేశారు. శివాజీ తో ఆమె మంచి అనుబంధం కూడా ఏర్పాటు చేసుకుంది. అప్పట్లో శివాజీ నేను వెళ్ళిపోతాను సార్, పాపం ఆ అమ్మాయిని లోపలకు పంపేయండి అని చాలా బ్రతిమిలాడాడు. అలా నయనీ పావని ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు, ఆడియన్స్ లో కూడా సానుభూతి కలిగింది. ఏమాత్రం రీ ఎంట్రీ కి అవకాశం ఉన్నా లోపలకు పంపండి అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ట్రెండ్ కూడా చేసారు. ఆడియన్స్ రిక్వెస్ట్ ని బలంగా గమనించిన బిగ్ బాస్ టీం ఎట్టకేలకు ఆమెని ఈ సీజన్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాడు. అయితే నయనీ పావని కి హౌస్ లో ఉన్న ఆ వారం రోజులు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. ఆమె బయటకి రాగానే బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇటీవలే ఒక పాన్ ఇండియన్ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది.

    కానీ ఆమెకు బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ క్యారక్టర్ ని వదిలేసుకుంది. రెమ్యూనరేషన్ కూడా ఆ పాత్ర కోసం 10 లక్షలు ఇస్తామని చెప్పారట, కానీ నయనీ ఒప్పుకోలేదు. అంతే కాదు ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాం లో అద్భుతంగా డ్యాన్స్ వేసింది. ఈమె డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చూసి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ అమ్మాయిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయారు. సీజన్ మొత్తం డ్యాన్స్ అదరగొట్టిన నయనీ రన్నర్ గా నిల్చింది. ఈ షో ద్వారానే ఆమె కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడు ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు అయ్యింది. ఈ సీజన్ లో ఆమె కసితో ఆడితే మాత్రం కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఈమెకు వచ్చిన ఈ అరుదైన రెండవ అవకాశాన్ని ఎంత వరకు ఉపయోగించుకుంటుంది అనేది.