https://oktelugu.com/

Sandhya Theatre Incident: సంధ్య థియేటర్లో రేవతి మృతికి అసలు కారణం ఇదా? అల్లు అర్జున్ తప్పు లేదా? సంచలనం రేపుతున్న వీడియో!

సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ ని తీవ్ర సమస్యల్లోకి నెట్టింది. ఈ కేసులో నిందుతుడిగా ఉన్న అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నారు. అల్లు అర్జున్ అభిమాని రేవతి తొక్కిసలాట కారణంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ కారణం అది కాదంటూ.. ఓ వీడియో తెరపైకి వచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : December 25, 2024 / 09:44 AM IST

    Sandhya Theatre Incident(1)

    Follow us on

    Sandhya Theatre Incident: డిసెంబర్ 4 రాత్రి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. అల్లు అర్జున్ అదే సమయంలో సంధ్య థియేటర్ కి వచ్చారు. థియేటర్ లో సినిమా చూశారు. దాంతో భారీగా అభిమానులు అక్కడకు చేరుకున్నారు. కాగా పుష్ప 2 మూవీ చూసేందుకు కుటుంబంతో పాటు సంధ్య థియేటర్ కి వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.

    కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ లతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ సైతం అరెస్ట్ అయ్యాడు. హైకోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు. డిసెంబర్ 24న అల్లు అర్జున్ మరోసారి విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా మూడు గంటల పాటు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అధికారులు ప్రశ్నించారు. మరో రెండు మూడు రోజులు అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలని సమాచారం.

    అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లడమే రేవతి మృతికి కారణం అని పోలీసుల వాదన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారు. ఒక మహిళ మృతి కేసు అల్లు అర్జున్, తెలంగాణ గవర్నమెంట్ మధ్య నిప్పు రాజేసింది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వాన అవుతుంది. ఇగో వార్ కి దారి తీసింది. రాజకీయ రంగు పులుముకుంది.

    అయితే రేవతి మృతికి తొక్కిసలాట కారణం కాదు, ఒకవేళ తొక్కిసలాట చోటు చేసుకున్నా.. అందుకు అల్లు అర్జున్ కారణం కాదంటూ, ఓ వాదన తెరపైకి వచ్చింది. సంధ్య థియేటర్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అల్లు అర్జున్ అభిమానులు, మద్దతుదారులు ఆయన తప్పేమీ లేదంటున్నారు. అల్లు అర్జున్ 9:40 గంటల ప్రాంతంలో థియేటర్ లోకి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న రేవతిని 9:16 గంటల సమయంలో హాల్ నుండి క్యాంటీన్ కి తీసుకు వస్తున్నట్లు సీసీ టీవీ కెమెరాలో నమోదు అయ్యింది.

    కాబట్టి పరిమితికి మించి థియేటర్ లో అభిమానులు ఉండటం కారణంగా రేవతి, ఆమె కుమారుడు ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉంటారు. అందుకు తొక్కిసలాట కారణం కాదని అంటున్నారు. అలాగే తొక్కిసలాట జరిగితే రేవతి శరీరంలోని అవయవాలు, ఎముకలు దెబ్బతింటాయి. పోస్టుమార్టం రిపోర్ట్ లో అలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. పోలీసులు మాత్రం.. సీసీ టీవీ ఫుటేజ్ టైమింగ్ అరగంట ఆలస్యంగా ఉంది, అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగిందంటూ పోలీసులు వాదిస్తున్నారు.