https://oktelugu.com/

గుండు వెనుక అసలు కారణం ఇదా….?

టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో నిన్న సాయంత్రం నుంచి మెగాస్టార్ గుండు గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గుండు లుక్ లో చిరంజీవి బాగానే ఉన్నా అకస్మాత్తుగా చిరంజీవిని లుక్ ను మార్చుకోవడానికి గల కారణాలు చాలామందికి అర్థం కాలేదు. కొందరు ఈ లుక్ కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య కోసమని చెబుతుంటే మరికొందరు మాత్రం చిరంజీవి కొత్త సినిమా కోసం న్యూ లుక్ ను ట్రై చేయబోతున్నారని కామెంట్లు చేశారు. అయితే చిరంజీవి కుటుంబం వైపు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 11, 2020 / 08:25 PM IST
    Follow us on

    టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో నిన్న సాయంత్రం నుంచి మెగాస్టార్ గుండు గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గుండు లుక్ లో చిరంజీవి బాగానే ఉన్నా అకస్మాత్తుగా చిరంజీవిని లుక్ ను మార్చుకోవడానికి గల కారణాలు చాలామందికి అర్థం కాలేదు. కొందరు ఈ లుక్ కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య కోసమని చెబుతుంటే మరికొందరు మాత్రం చిరంజీవి కొత్త సినిమా కోసం న్యూ లుక్ ను ట్రై చేయబోతున్నారని కామెంట్లు చేశారు.

    అయితే చిరంజీవి కుటుంబం వైపు నుంచి, సినీ వర్గాల నుంచి మాత్రం మెగాస్టార్ గుండు చేయించుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. సాధారణంగా గుండు చేయించుకోవడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. కొందరు మొక్కుల కోసం గుండు చేయించుకుంటే మరికొందరు అశుభం జరిగినప్పుడో, స్టైల్ కోసమో, జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడో గుండు చేయించుకుంటూ ఉంటారు. చిరంజీవి ఈ లుక్ లో శివాజీ సినిమాలో రజనీకాంత్ గుండుబాస్ ను పోలి ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

    ఇలా గుండు చేయించుకోవడం ద్వారా చిరంజీవి ఆచార్య యూనిట్ కు మరో రెండు మూడు నెలలు షూటింగ్ కు రానని ఇండికేషన్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటించాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయ్యే వరకు రామ్ చరణ్ ఆచార్యకు డేట్స్ ఇవ్వరు. అందువల్ల దర్శకుడు వినాయక్ లా హెయిర్ వీవింగ్ ను ట్రై చేయాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారని ఒక గ్యాసిప్ వినిపిస్తోంది.

    మరోవైపు చిరంజీవి కొరటాల ఆచార్య తరువాత రామ్ చరణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తారని భావిస్తే ఆయన బన్నీతో చేయడానికి సిద్ధమవడంతో ఆచార్య షూటింగ్ విషయంలో తొందర పడకూడదని చిరు నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.